Janasena on YSRCP Kapu Leaders: టీడీపీ - జనసేన "జెండా" సభ తర్వాత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ దిగజారుడుతనం స్పష్టంగా కనిపించిందని జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు విమర్శించారు. వైసీపీ కాపు నాయకులతో జనసేన నేతలను తిట్టిస్తున్నారని ఆవేదన చెందారు.
కాపుల భుజం మీద తుపాకి పెట్టి కాపు నాయకులనే జగన్ గురిపెట్టారని తెలుసుకోవాలని పేర్కొన్నారు. జగన్ పెట్టే దాని కోసం వైసీపీ కాపు నేతలు ఆశపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని, హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్‌తో కూడా తిట్టిస్తున్నారని అన్నారు.
జయహో బీసీ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్- నాదెండ్ల మనోహర్
ఒక పథకం ప్రకారం పవన్ కల్యాణ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పవన్‌పై విమర్శలు చేసే వారు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. వంగవీటి రంగాని చంపిన మొదటి ముద్దాయి కుటుంబం వైసీపీలో ఉందని తెలీదా అని ప్రశ్నించారు. జాతిని కాపాడుతున్నామనే నెపంతో హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్‌పై లేఖలు రాయడం మానుకోవాలని హితవు పలికారు. వైసీపీలో ఉన్న కాపునేతలు ఎవరూ కాపుల మేలుకోరే వారు కాదని అన్నారు. పీకే సర్వే మీద అచంచలమైన విశ్వాసం ఉన్న వ్యక్తి జగన్ అని, ఇప్పుడు పీకే సర్వేపై ఏం అంటారని పంచకర్ల ప్రశ్నించారు.
"పవన్ కల్యాణ్‌పై ఏ మాట పడితే ఆ మాట అంటున్నారు. అస్సలు ఆయన ఏ అధికారంలోకి వచ్చారని తాకట్టు పెట్టారు అని అంటున్నారు. ఏ విధంగా ప్యాకేజీ తీసుకున్నాడు అని చెప్తున్నారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకూడదు అనే ఆయనపై విషం చల్లుతున్నారు. మీరు పైకి రావడం కోసం జాతిని తాకట్టు పెడుతున్నారు. జగన్ వేసే ఎంగిలి మెతుకుల కోసం పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారు". - పంచకర్ల రమేష్‌బాబు, జనసేన నేత
రాష్ట్రంలో అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం : కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి
రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టారని, కనీసం పోలవరం పూర్తి చెయ్యలేక పోయారని, అంచనా వ్యయం పెంచి అభాసుపాలు అయ్యారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Peethala Murthy Yadav) అన్నారు. ఈ ఐదేళ్లలో పోలవరం పూర్తి చెయ్యలేదని, విశాఖలో బస్ షెల్టర్ కూడా కట్టలేదని మండిపడ్డారు. సముద్రంపై తేలే వంతెన కట్టలేని ఈ జగన్ ప్రభుత్వం, రాజధాని ఎలా కడుతుందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని ఏ మొహం పెట్టుకుని వెళ్తారని, విశాఖ ఆస్తులు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇక ఇప్పుడు సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని ఆవేదన చెందారు. రాష్ట్రాభివృద్ది కోసం జనసేన తపిస్తుందని పీతల మూర్తి యాదవ్ తెలిపారు. నిరంతరం రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచిస్తుందని చెప్పారు.
'జగన్ వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు- జెండా సభ విజయంతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు'
వైసీపీలో ఉన్న కాపునేతలు ఎవరూ కాపుల మేలుకోరే వారు కాదు: జనసేన నేతలు