Police Behavior in Tadepalligudem Sabha: నిన్న జరిగిన తాడేపల్లిగూడెం సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుకొనే వైఎస్సార్సీపీ మంత్రులు, జగన్ పేదల కోసం ఏం చేశాడో చెప్పడానికి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
తాడేపల్లి డైరెక్షన్లోనే పోలీసుల: విజయవాడ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కిరణ్ రాయల్, పోతిన వెంకట మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో నిన్న జరిగిన జెండా బహిరంగ సభ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చే కార్యకర్తలను తాడేపల్లి డైరెక్షన్లో పోలీసులు సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పోలీసులు రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా విధులు నిర్వహించాలని విషయం మర్చిపోవటం శోచనీయమని కిరణ్ రాయల్ పేర్కొన్నారు.
టీడీపీ-జనసేన సభకు భారీ స్పందన - 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు
బహిరంగ చర్చకు సిద్దమా?: రాష్ట్ర ప్రజలు వైఎస్సార్సీపీ మోసపూరిత పథకాలను ఇష్టపడటం లేదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ పరిపాలనలో ఎవరైనా పేదవారు ధనికులుగా మారినట్లు ఉంటే తమతో మంత్రులు చర్చకు సిద్ధంగా ఉండాలని అన్నారు. మీడియా ముందు డాంబికాలు పలికే వైఎస్సార్సీపీ మంత్రులు, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎన్ని ఇచ్చాడో, ఎన్ని రద్దు చేశాడో చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరాడు. జనసేన పార్టీ తరపున తాము అందరం సిద్ధంగా ఉన్నామని, తమతో బహిరంగ చర్చకు రావాలని పోతిన డిమాండ్ చేశారు.
టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్ - వైఎస్సార్సీపీ చీటింగ్ టీమ్: చంద్రబాబు
చూసి కూడా సరిగ్గా చదవలేని జగన్: తెలుగు జన విజయకేతనం జెండా సభ విజయంతో తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోందని తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగూల్ మీరా అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్ గ్రహించి అప్పుడే బెంగళూరు ప్యాలెస్ కు రంగులు వేయిస్తున్నాడని విమర్శించారు. తాడేపల్లి నుంచి బెంగుళూరు వెళ్లిపోవటానికి జగన్ సిద్ధమయ్యాడని స్పష్టమవుతోందన్నారు. భయపెట్టి, ప్రలోభపెట్టి జగన్ తన సభలకు జనాన్ని తరలిస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని చూడకుండా చెప్తున్నాడన్న ఆయన, చూసి కూడా సరిగ్గా చదవలేని జగన్ కు స్క్రిప్ట్ రైటర్ ఎవ్వరని నిలదీశారు. త్రివిక్రమ్ ఏమైనా జగన్ కు స్క్రిప్ట్ రాసి ఇస్తున్నాడా అని ప్రశ్నించారు. వాపు చూసి బలుపు అనుకుంటున్న జగన్, తనని తాను మోసం చేసుకుంటున్నాడని నాగూల్‌మీరా మండిపడ్డారు.
వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్