తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం ఒక్క బీఆర్​ఎస్​తోనే సాధ్యం : హరీశ్​ రావు

Harish Rao Fires On Congress : కాంగ్రెస్​ మోసపూరిత వైఖరిని ప్రజలకు వివరించి ఆ పార్టీ మోసాలపై నిలదీయడంతో పాటు ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని మాజీ మంత్రి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు నేతలకు సూచించారు. కేసీఆర్​ ఆదేశాల మేరకు ఖమ్మం, మహబూబాబాద్​ ఎంపీ అభ్యర్థులు, ముఖ్యనేతలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. గల్లీలో కాంగ్రెస్​ ఉన్నా, తెలంగాణ సమస్యలు ఉన్న దిల్లీ వేదికగా ప్రశ్నించి, పరిష్కరించేందుకు బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థులు గెలవాలని హరీశ్​ రావు అన్నారు.

Harish Rao Fires On Congress
Harish Rao Fires On Congress

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 10:06 PM IST

Updated : Mar 4, 2024, 10:27 PM IST

Harish Rao Fires On Congress : కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి చెప్పాలని మోసాలపై నిలదీయడంతో పాటు ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు నేతలకు సూచించారు. అధినేత కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకు ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. గల్లీలో కాంగ్రెస్ ఉన్నా, తెలంగాణ సమస్యలు దిల్లీ వేదికగా ప్రశ్నించి, పరిష్కరించేందుకు బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థులు గెలవాలన్నారు. రాజీ పడకుండా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడటం ఒక్క బీఆర్​ఎస్​తోనే సాధ్యమన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు.

కేసీఆర్‌ కుటుంబసభ్యుల ఉద్యోగాలు ఊడిన తర్వాతే యువతకు జాబ్‌లు వస్తున్నాయి : సీఎం

Harish Rao :అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావొస్తున్నా ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ (Congress) పార్టీ విఫలమైందన్న ఆయన రెండు, మూడు హామీలు అసంపూర్తిగా అమలు చేసి అన్నీ చేసినట్లు ప్రచారం చేసుకుంటోందని ఆక్షేపించారు. రుణమాఫీ చెల్లించకుండా చోద్యం చూస్తోందని కరెంట్ రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పొలాలకు నీరు అందక ట్యాంకర్లతో నీళ్లు అందించే కాలం వచ్చిందన్న హరీశ్​ రావు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్ల దుస్థితిని కాంగ్రెస్ మళ్లీ తెచ్చిందని ఎద్దేవా చేశారు. అర్హుల పేరిట 30 శాతం మందికే గ్యాస్ రాయితీ ఇస్తూ మిగతా వారికి మొండి చేయి చూపుతున్నారని ఇలాంటి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు ఇంటింటికీ వెళ్లి చెప్పాలని నేతలకు సూచించారు.

BRS Lok Sabha Election : మార్చి 17తో కాంగ్రెస్ వందరోజుల పాలన పూర్తి చేసుకుంటుందని హామీలు అమలు చేయకుండా చోద్యం చూస్తున్న కాంగ్రెస్​ను నిలదీయాలని తెలిపారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే అనునిత్యం నిలదీసే బీఆర్​ఎస్​తోనే సాధ్యం అవుతుందని, వాస్తవాలను ఎప్పటికపుడు అన్ని వర్గాల ప్రజలకు వివరించాలని చెప్పారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత ప్రారంభమైందన్న మాజీ మంత్రి అడుగడుగునా కాంగ్రెస్​ను నిలదీసే రోజులు ముందున్నాయని పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రజలను జాగృతం చేయాలని సూచించారు.

లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్ - ఫస్ట్‌ లిస్ట్‌లో వీరికే ఛాన్స్

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : పొన్నం

'ఆదిలాబాద్‌ వేదికగా మోదీ, రేవంత్‌ల బడే భాయ్, చోటా భాయ్‌ బంధం బహిర్గతమైంది'

Last Updated : Mar 4, 2024, 10:27 PM IST

ABOUT THE AUTHOR

...view details