Employees Leaders on Joint Staff Council Meeting:ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో మరోమారు చర్చలు జరిపింది. ఉద్యోగులు గత కొంత కాలంగా, పీఆర్సీతో పాటు పెండింగ్ బకాయిలు, డీఏ అరియర్లు, ఆర్ధిక, ఆర్ధికేతర అంశాలపై బిల్లుల చెల్లింపులకు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల సమస్యలపై అనేక సార్లు చర్చలు జరిపింది. కాగా ఆ చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో, తాజాగా మరోమారు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది.
ఎన్నికల కోడ్‌తో సంబంధం ఏంటి ? - ఉద్యోగ సంఘాలపై బొత్స, సజ్జల చిరాకు
ఈ సందర్భంగా ఆర్ధికేతర అంశాలతో పాటు ఉద్యోగుల ఆర్ధికపరమైన డిమాండ్లపైనా ప్రభుత్వం స్పందించాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి (Chief Secretary to Govt KS Jawahar Reddy) నేతృత్వంలో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ఓ మొబైల్ యాప్‌ను రూపొందించాల్సి వచ్చిందని ఏపీ అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP Amaravati JAC leader Bopparaju) వ్యాఖ్యానించారు.
27న ప్రభుత్వ ఉద్యోగుల 'చలో విజయవాడ' - పోస్టర్ విడుదల
గతంలో నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘంలో అదనపు క్యాంటం ఆఫ్ పెన్షన్‌ను, అలాగే 2004 కంటే ముందు విధుల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశామని ప్రభుత్వం ఆయా అంశాలపై స్పష్టత ఇవ్వలేదని బొప్పరాజు వ్యాఖ్యానించారు. వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించినా ఎక్కువ మంది ఉన్న విద్యాశాఖలో క్రమబద్దీకరించటం దారుణమని ఆరోపించారు. జెడ్పీలలో కారుణ్య నియామకాలను అమలు చేయాలన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఉద్యోగులకు రూ. 20 వేల కోట్ల బకాయిలు- చర్చలు నిరుత్సాహపరిచాయి, ఉద్యమం కొనసాగుతుంది: ఉద్యోగ సంఘాలు
ఇకపై ఎవరికీ ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఆర్దికపరమైన అంశాలపై కాకుండా ప్రభుత్వం ఆర్దికేతర అంశాలపై మాత్రమే చర్చించాలనటం శోచనీయమని ఏపీ ఎన్జీవో నేత శివారెడ్డి, ఏపీటీఎఫ్ నేతలు హృదయరాజు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పీఆర్సీ ఆలస్యం అయినా మధ్యంతర భృతి అడిగే అవకాశం కూడా లేకపోయిందని అన్నారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఈ అంశాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులుగా నిరాశతో ఉన్నామని ఎస్టీయూ నేత సాయి శ్రీనివాస్ (STU leader Sai Srinivas) వ్యాఖ్యానించారు.
ఉద్యోగ సంఘాల డిమాండ్స్: అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు, ఉద్యోగుల ఆరోగ్య కార్డు, మెడికల్ రీ ఎంబర్స్‌మెంట్ ప్రభుత్వం ఉద్యోగస్థులకు చెల్లించాల్సిన వాటికోసం డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఏపీజీఎల్ఐ బకాయిలు, సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్, సరెండర్ లీవ్, డీఏ బకాయిలు, ఆఫీసు నిర్వహణ, ప్రోటోకాల్, 2019 ఎన్నికల బడ్జెట్, లీగల్ వ్యవహారాల డబ్బులకు సంబంధించి బకాయిలను చెల్లించాలంటూ ఉద్యోగ సంఘాలు గత కొంత కాలంగా కోరుతున్నాయి.