ETV Bharat / politics

ఎన్నికల కోడ్​తో సంబంధం ఏంటి ? - ఉద్యోగ సంఘాలపై బొత్స, సజ్జల చిరాకు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 12:26 PM IST

Updated : Feb 23, 2024, 3:18 PM IST

Ministers Committee Meeting: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాలతో సమావేశమైన మంత్రుల కమిటీ ఉద్యోగుల డిమాండ్లపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే తమ బకాయిలు విడుదల చేయాలని కోరిన ఉద్యోగులపై మంత్రి బొత్స, సజ్జల చిరాకు పడ్డారు.

ministers_committee_meeting
ministers_committee_meeting

ఎన్నికల కోడ్​తో సంబంధం ఏంటి ? - ఉద్యోగ సంఘాలపై బొత్స, సజ్జల చిరాకు

Ministers Committee Meeting: మంత్రి బొత్స, సలహాదారు సజ్జల, సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి సీపీఎస్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర సచివాలయం ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ రాక మునుపే బకాయిలు చెల్లించాలని కోరిన సీపీఎస్ ఉద్యోగులపై మంత్రి బొత్స, సలహాదారు సజ్జల చిరాకు పడ్డారు. ఎన్నికల కోడ్ కు బకాయిల విడుదలకు సంబంధం ఏమిటని బొత్స (Minister Botsa), సజ్జల ప్రశ్నించారు. మరోమారు వచ్చి కలవాలని మంత్రి బొత్స, సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

ఉద్యోగులకు రూ. 20 వేల కోట్ల బకాయిలు- చర్చలు నిరుత్సాహపరిచాయి, ఉద్యమం కొనసాగుతుంది: ఉద్యోగ సంఘాలు

సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశమైంది. కార్యక్రమానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్​లోని ఉద్యోగ సంఘాలు ఏపీ ఎన్జీజీవో, రెవెన్యూ ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు. పీఆర్సీ (PRC) బకాయిలు, పెండింగ్ డీఏలు, కొత్త పీఆర్సీలో భాగంగా మధ్యంతర భృతి ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై చర్చలు జరిపారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ జేఏసీ పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇస్తామని ఏపి జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ప్రకటించింది.

ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం - రేపు మంత్రుల బృందం భేటీ

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాల తో మంత్రుల కమిటీ చర్చలు ఫలవంతం కాలేదని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సంప్రదాయం ప్రకారం పీఆర్సీ నియమించినప్పుడు మధ్యంతర భృతి ఇవ్వాలన్నారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్, గత పీఆర్సీ అరియర్ లు, ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లింపుల పై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పిందని అన్నారు. పీఆర్సీ అరియర్ లు 14, 800 కోట్లు ఇవ్వాలన్నారు. ఎప్పుడు చెల్లించేది చెబుతామని గత సమావేశంలో చెప్పారని తెలిపారు. మధ్యంతర భృతి ప్రకటన కు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని అన్నారు.

ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి బొత్స సత్యనారాయణ

ఈ ప్రభుత్వం రివర్సు పీఆర్సీ ఇచ్చిందని అన్నారు. 12 పీఆర్సీనీ జూలై 31 లోపే సెటిల్ చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. అందుకే మధ్యంతర భృతి ప్రకటించడం లేదని చెప్పారని తెలిపారు. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపారు. తాము చేసిన డిమాండ్ ల పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దకరణకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందన్నారు. 10 వేల మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1300 మందిని మాత్రమే చేశారని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు పై పునరాలోచన చేస్తామని మంత్రుల కమిటీ చెప్పిందన్నారు.

Amaravati JAC leaders with CS: 'లిఖితపూర్వక హామీ ఇస్తే.. ఉద్యమంపై ఆలోచిస్తాం'

ఇప్పటి వరకు 10 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగినా ఎలాంటి ప్రయోజనం లేదని సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజేష్ అన్నారు. ఏపీజిఎల్ఐ నగదును ఫిజికల్ గా లేదా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోనివ్వడం లేదని అన్నారు. సరెండర్ లీవ్ బిల్లులు, మెడికల్ బిల్లులు రావడం లేదని, 148 నెలల డీఏ బకాయిల్లో కొందరికి కొంతే వచ్చిందని తెలిపారు. మంత్రులను అడిగితే కోడ్ వచ్చాక అన్నారు కానీ అది అయ్యేది కాదని అందరికీ తెలుసని అన్నారు. బకాయిలు, వాయిదాకు ఈ మీటింగ్ తప్ప మరేదీ లేదని అన్నారు. గత పది నెలలుగా సిపిఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ చెల్లించడం లేదని అన్నారు. ఇది మరో చాయి బిస్కెట్ సమావేశం కాకూడదని అన్నారు. ఇప్పటికే చాలా ఉద్యోగులుగా చాలా నష్టపోయామని తెలిపారు. ఈ చివరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో అయినా 2003 కన్న ముందు జాయిన్ అయిన వారికైనా ఓపీఎస్ ఇవ్వాలని కోరారు. ఈ ప్రభుత్వం ఎన్నికల కోడ్ లోపే ఆ జీఓ ఇవ్వాలని అన్నారు.

Last Updated : Feb 23, 2024, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.