ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు- గుంటూరు ఘటనపై టీడీపీ నేతల ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 7:36 PM IST

Contaminated water problem in Guntur: గుంటూరులో కలుషిత తాగునీటి సరఫరా వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించలేదని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కలుషిత నీరు తాగి యువతి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై ఆలస్యంగా స్పందించిన మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

contaminated_water_problem
contaminated_water_problem

ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు- గుంటూరు ఘటనపై టీడీపీ నేతల ఆగ్రహం

Contaminated water problem in Guntur:కలుషిత నీరు సరఫరా అవుతోందంటూ ప్రజలు గగ్గోలు పెట్టినా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించలేదని గుంటూరులో తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. తాగునీటి పైపులైన్లు, ట్యాంకుల నిర్వహణను గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కలుషితనీరు తాగి యువతి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన ప్రభుత్వం జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత తాపీగా స్పందించింది. అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి రజని బాధితులకు ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

అప్రమత్తమైన గుంటూరు నగరపాలక అధికారులు- రెండ్రోజులు కాచి చల్లార్చిన నీరు తాగాలని సూచన

Health Minister Vidada Rajani Review:గుంటూరులో డయేరియా అనుమానిత కేసుల తాకిడి ఉన్న శారదానగర్ కాలనీలో ప్రత్యేకంగా వైద్య సేవలందిస్తున్నట్లు మంత్రి విడదల రజని చెప్పారు. కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, మేయర్, కమిషనర్, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రిలో చేరిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మొత్తం 41 మంది డయేరియా అనుమానిత లక్షణాలతో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చారని మంత్రి తెలిపారు.

గుంటూరు వాసులకు నీటి కష్టాలు తప్పవా - అధికారులు పట్టించుకోరా!

వారిలో 8 మంది నగరానికి చెందిన వారు కాదని, గురజాల, మేడికొండూరు, పేరేచర్ల, సిరిపురం ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన వారని పేర్కొన్నారు. ఆహార, నీటి నమునాలను పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించామన్నారు. నగర ప్రజల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. రెండు వారాలుగా కలుషిత తాగునీటి సమస్య ఉందని ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎందుకు స్పందించలేదని విలేకరులు ప్రశ్నించగా దాటవేత ధోరణితో సరైన సమాధానం చెప్పలేదు. పైగా ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారంటూ ప్రశ్నలకు బదులు ఇవ్వకుండానే మంత్రి రజని లేచి వెళ్లిపోయారు.

ప్రాణాలు తీస్తున్న కలుషిత నీరు - ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అధికారులు

TDP Leaders Reaction on Water Issue:కలుషిత తాగునీటి సరఫరా వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, కార్పొరేషన్ అధికారులు అలసత్వం వీడటం లేదని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ విమర్శించారు. బీఆర్ స్టేడియం, నెహ్రూ నగర్‌లోని నీటి ట్యాంకులను తెలుగుదేశం కార్పొరేటర్లతో కలిసి నసీర్ పరిశీలించారు. నీటి శుభ్రతకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. కార్పొరేషన్ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. సురక్షిత తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం చూపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా మీద మండిపడ్డారు. వాంతులు, విరేచనాలు వంటి డయేరియా లక్షణాలతో పదుల సంఖ్యలో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ బాధితులు చేరుతున్నారన్నారు. కలుషిత నీరే ప్రజల అనారోగ్యానికి కారణమని, ఇప్పటికైనా కార్పొరేషన్ సిబ్బంది అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details