ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెద్దిరెడ్డి కుటుంబం రూ.30వేల కోట్ల అవినీతికి పాల్పడింది- అక్రమ కేసులతో ప్రజల్ని వేధించారు: చంద్రబాబు - Chandrababu fired at Peddireddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 7:19 PM IST

Chandrababu fired at Peddireddy: పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇసుక, మద్యం వ్యాపారం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబానిదే, ఆ కుటుంబమంతా అవినీతి చేసి రూ.30వేల కోట్లు కొట్టేశారని మండిపడ్డారు.

Chandrababu
Chandrababu (ETV Bharat)

Chandrababu fired at Peddireddy: పుంగనూరు ప్రజలకు ఇవాళే స్వాతంత్ర్యం వచ్చిందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే వ్యక్తి చల్లా బాబు అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి పెద్దిరెడ్డికి పోలిక ఉందా? అంటూ ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డి ఆధిపత్యానికి కిరణ్‌కుమార్‌రెడ్డి చెక్‌పెడతారని, కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీ అయ్యాక, పెద్దిరెడ్డికి నిద్ర ఉండదని హెచ్చరించారు. మామిడికాయల కొనుగోలులో కమీషన్లు కొట్టేశారని, ఇసుక, మద్యం వ్యాపారం మెుత్తం పెద్దిరెడ్డి కుటుంబానిదే అన్నారు. అవినీతి చేసి రూ.30 వేల కోట్లు కొట్టేశారని, అక్రమ కేసులు పెట్టి ప్రజలను వేధించారని చంద్రబాబు మండిపడ్డారు.

రామచంద్రయాదవ్‌, పెద్దిరెడ్డి స్వగ్రామానికి వెళ్తే దాడి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. చల్లా బాబుపై అక్రమ కేసులు పెట్టారు. పెద్దిరెడ్డి అవినీతిపై ప్రశ్నించిన తనపై కేసులు పెట్టించారని పేర్కొన్నారు. అంగళ్ల ఘటనలో 400 మందిపై కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక బాదుడే బాదుడే అంటూ ఎద్దేవా చేశారు. పెంచిన మద్యం ధరల్లో పెద్దిరెడ్డి ( Peddireddy ), జగన్‌ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. 2019లో కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారు. మద్యపాన నిషేధం అన్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి వచ్చింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక కరెంట్‌ ధరలు పెంచారు. జగన్‌ సీఎం అయ్యాక పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచారు. చెత్తపై పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్‌ అంటూ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతపండుకు ఎక్కవ ధర ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు.

వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు: వైఎస్‌ షర్మిలారెడ్డి - YS Sharmila Election Campaign

పెద్దిరెడ్డి కుటుంబం రూ.30వేల కోట్ల అవినీతికి పాల్పడింది- అక్రమ కేసులతో ప్రజల్ని వేధించారు: చంద్రబాబు (ETV Bharat)

వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు న్యాయం చేసిందని, పొత్తులు పెట్టుకుని వాస్తవాలు చెబుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. కానీ సీఎం జనగ్ తన కేసుల కోసం చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. ఉర్దూ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల (Urdu Residential Junior College) కేటాయిస్తామని తెలిపారు. 4 శాతం రిజర్వేషన్ల కాపాడుతామన్నారు. తాను సీఎం అయ్యాక రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెడతామని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. మహిళలకు ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేస్తామన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పిన మెుదటి వ్యక్తి పవన్‌ అని, పుంగనూరును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని పేర్కొన్నారు. కుప్పంతో సామానంగా పుంగనూరును అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సంపాదించిన అవినీతి సొమ్మును జూన్‌ 4న తర్వాత కక్కిస్తానని హెచ్చరించారు.

చంద్రబాబును కలిసిన తన్జీమ్ ఈ ముఫ్తియాన్ ప్రతినిధులు- ఎన్డీఏ కూటమికి మద్దతు - Tanzim e Muftiyan support for NDA

ABOUT THE AUTHOR

...view details