ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వివేకా హత్య కేసులో నిందితుడిని కాదు - సాక్షిని మాత్రమే: దస్తగిరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 3:38 PM IST

Viveka murder case approver Dastagiri: వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. తనను నిందితుడిగా కాకుండా సాక్షిగా పరిగణించాలని దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
Viveka murder case approver Dastagiri
Viveka murder case approver Dastagiri

Viveka Murder Case Approver Dastagiri:వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.వివేకా కేసులో తన పేరును నిందితుడిగా తొలగించాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ హైదరాబాద్​లోని నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. హత్య కేసులో తనను సాక్షిగా మాత్రమే పరిగణించాలని దస్తగిరి తన పిటిషన్​లో పేర్కొన్నారు. సీబీఐ కోర్టు దస్తగిరి పిటిషన్‌పై విచారణను ఈనెల 12కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ అధికారుల హామీతో దస్తగిరి అప్రూవర్‌గా మారిన దస్తగిరి గత కొంత కాలంగా వైఎస్సార్సీపీ పెద్దలపై ఆరోపణలు చేస్తున్నారు. హత్య కేసులో తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇప్పటికే పలుమార్లు తెలిపారు. తాజాగా ఈ కేసులో తనను ప్రలోభాలకు గురి చేసిన విషయాన్ని సీబీఐ, అధికారులతో పాటుగా, కడప జిల్లా ఎస్సీకి సైతం ఫిర్యాదు చేశారు.

వివేకా హత్యతో గత ఎన్నికల్లో లబ్ది - ఈసారీ అదే కుట్రతో పావులు కదుపుతున్నారు : దస్తగిరి

వివేకా హత్యకేసులో అప్రూవర్​గా మారిన దస్తగిరి:వివేకా హత్య కేసులో 2021 సెప్టెంబరు 9న ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. వివేకాను హత్య చేయడానికి బైకులో గొడ్డలి ఇంటికి తెచ్చింది ఉమాశంకర్ రెడ్డి అని సీబీఐ తేల్చింది. వివేకాను హత్య చేయడానికి నెలరోజుల ముందే వివేకా ఇంటి కుక్కను ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ కలిసి కారుతో ఢీకొట్టి చంపేశారు. ఇదంతా హత్య కుట్రలో భాగమేనని సీబీఐ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్టోబరు 26న సీబీఐ పులివెందుల కోర్టులో ప్రిలిమినరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, డ్రైవర్ దస్తగిరి పేర్లను ఛార్జిషీట్ లో చేర్చింది. ఈకేసులో సీబీఐవిచారణకు సహకరించేందుకు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారాడు. అక్టోబరు 22న దస్తగిరికి కడప కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయగా, అదే రోజు దస్తగిరి కోసం సీబీఐ అప్రూవర్ పిటిషన్ వేసింది. దానిపై విచారించిన న్యాయస్థానం అప్రూవర్ గా మారడానికి సమ్మతించింది. డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ, అప్పట్లో ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినా ఫలితం లేకపోయింది.

వివేకాను హత్య చేయించిన జగన్​కు ఓటు అడిగే హక్కు ఉందా?: దస్తగిరి

వైఎస్సార్సీపీ పెద్దల నుంచి వేదింపులు: అప్రూవర్‌గా మారిన తనపై వైఎస్సార్సీపీ పెద్దలు బురద జల్లుతున్నారని గత కొద్దిరోజులుగా దస్తగిరి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో తనను ఇరికించి, హత్యకేసులో అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ చిత్రహింసలకు గురిచేశారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని గతంలో దస్తగిరి పేర్కొన్నారు. తాను నాలుగు నెలల పాటు కడప జైల్లో రిమాండ్‌లో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డి కలిసి బెదిరించారని తెలిపారు. వారు చెప్పినట్లు వినకపోతే ప్రాణాలతో ఉంచమని, నరికేస్తాం అంటూ హెచ్చరించారని ఇప్పటికే దస్తగిరి వెల్లడించారు.

ఎంపీ టికెట్టు విషయంలోనే వివేకాను సీఎం జగన్‌ చంపించారు: దస్తగిరి

ABOUT THE AUTHOR

...view details