ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాత్రి అన్నంలో పప్పు, ఉదయం చాయ్​తో స్నాక్స్ - తీహాడ్ జైలులో కవిత మొదటి రోజు మెను! - BRS Leader Kavitha At Tihar Jail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 10:31 PM IST

Kavitha Spends First Day at Tihar Jail: దిల్లీ మద్యం కేసులో అరెస్టైన తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు కవిత తీహాడ్ జైలుకు వెళ్లి ఒకరోజు గడిచింది. తనతో పాటు జైలులో ఉన్న మరో ఇద్దరు మహిళా ఖైదీలకు కూడా ఆహారం వడ్డించారంట కవిత. జైలులో తొలిరోజు రాత్రి ఆమె ఏం భోజనం చేశారు? ఏవిధంగా గడిచింది? లాంటి పలు ఆసక్తికరమైన విషయాలను జైలు వర్గాలు వెల్లడించాయి.

Etv Bharat
Etv Bharat

Kavitha Spends First Day at Tihar Jail : దిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు కవిత తీహాడ్ జైలులోమొదటి రోజు పూర్తైంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జైలులో(Tihar Jail) 6 వ నంబర్ విభాగంలో మరో ఇద్దరు మహిళా ఖైదీలతో పాటు కవిత భోజనం చేశారని సమాచారం. ఉదయం స్నాక్స్ తిని టీ తాగారు.

"ఆమె మంగళవారం రాత్రి తన తోటి ఇద్దరు ఖైదీలతో కలిసి భోజనం చేశారు. అన్నంతో పాటు పప్పును తీసుకున్నారు. వీటిని తనతో పాటు ఉన్న మరో ఇద్దరు ఖైదీలకు కూడా వడ్డించి భోజనం చేశారు" - జైలు వర్గాలు

తిహాడ్ జైలుకు ఎమ్మెల్సీ కవిత - ఇంటి నుంచే భోజనం, మంచం, పరుపులకు వెసులుబాటు - BRS MLC KAVITHA ED CUSTODY

BRS MLC Kavitha Facilities at Tihar Jail : టీ, ఆహారం, టీవీ చూసే సమయాలు ఇతర ఖైదీల మాదిరిగానే కవితకూ ఉంటాయని మరో అధికారి తెలిపారు. కవిత ప్రత్యేకంగా నిర్దిష్ట వసతులు ఏమీ డిమాండ్ చేయలేదని జైలు వర్గాలు వివరించాయి. నిబంధనల ప్రకారమే ఆమెకు వస్తువులను అందజేస్తామని అధికారులు వివరించారు.

న్యాయస్థానం ఆదేశాల ప్రకారం, ఆమెకు ఇంటి భోజనం, మంచం, పరుపులు, చెప్పులు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఉందని జైలు అధికారి వివరించారు. వీటితో పాటు దుస్తులు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, నగలు, మందులు బంగారు ఆభరణాలు ధరించేందుకు కూడా అనుమతి ఉంది. అయినప్పటికీ ఆమె జైలుకు వచ్చేటప్పుడు ఎలాంటి అభరణాలు ధరించలేదని జైలు వర్గాలు తెలిపాయి. ఆమెకు తీహాడ్ జైలు గ్రంథాలయంలోని(Library) పుస్తకాలు ఉపయోగించుకునే సౌలభ్యం ఉందని ఆయన వివరించారు. తీహాడ్ జైలు కాంప్లెక్స్​లో సుమారు 500 మంది మహిళలు ఉన్నారు.

సుప్రీంకోర్టులో కవితకు దక్కని ఊరట - బెయిల్ విషయంపై ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచన - Supreme Court on Kavitha Petition

దిల్లీ మద్యం పాలసీకేసులో అరెస్టయి తీహాడ్ జైలులో ఉన్న మనీశ్ సిసోదియా, సంజయ్ సింగ్ తర్వాత మూడో రాజకీయ నేత కవిత కావడం గమనార్హం. సిసోదియా జైలు నంబర్ 1 , సంజయ్ సింగ్​కు జైలు నంబర్ 2 ను కేటాయించారు. మరో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత సత్యేంద్ర కుమార్ ఏడో నంబర్ జైలులో ఉంచారు. దిల్లీ మద్యం కేసులో కవితకు వచ్చేనెల 9 వరకు రౌజ్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. ఆమె తరపు లాయర్లు నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే దీనిపై కోర్టు తన నిర్ణయం వెల్లడించనుంది.

దిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరోపేరు - కవిత అల్లుడి పాత్రపై ఈడీ ఆరా - DELHI EXCISE POLICY UPDATES

ABOUT THE AUTHOR

...view details