ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం: అంగన్వాడీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 11:01 PM IST

Anganwadis Warns to Government about Promises: ప్రభుత్వం ఇచ్చిన హామీతో సమ్మె విరమించామని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్లీ ఉద్యమబాట పడతామని అంగన్వాడీలు హెచ్చరించారు.

Government Agree with Anganwadis Demands
Government Agree with Anganwadis Demands

Anganwadis Warns to Government about Promises: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరో ఉద్యమం చేపడతామని అంగన్వాడీ సంఘాల రాష్ట్ర నాయకులు తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన చర్చల్లో ప్రభుత్వం కొంత మేర సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అయితే వేతనాలు మాత్రం ఎంత పెంచుతామో ప్రభుత్వం స్పష్టం చేయలేదని పేర్కొన్నారు. దీన్ని లిఖిత పూర్వకంగా మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తమకు అందజేస్తుందని అంగన్వాడీల నాయకులు తెలిపారు. అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికలు తీర్చాలని 42రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టారని ఇది గొప్ప పోరాటమని నాయకులు పేర్కొన్నారు.

అంగన్వాడీ సహాయకురాలు ఆత్మహత్యాయత్నం - ప్రభుత్వ బెదిరింపులే కారణం!

Minister Botsa Tells Accept the Demands:ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో అంగన్వాడీలు సమ్మె విరమించారు. అంగన్వాడీల ఆందోళన సమయంలో అనేక డిమాండ్లను అంగీకరించామని, మిగిలిన వాటిపట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స పేర్కొన్నారు. అంగన్వాడీలు తమ ముందు 11 డిమాండ్‌లు పెట్టారని, వాటిలో పదింటిని నెరవేర్చేందుకు అంగీకరించామని ఆయన తెలిపారు. వేతనాలు పెంచాలనే డిమాండ్‌ను జులైలో నెరవేరుస్తామని మంత్రి బొత్స పేర్కొన్నారు. దీంతో సమ్మె విరమణకు అంగన్వాడీలు అంగీకరించారని మంత్రి తెలిపారు. రెండు దఫాలు అంగన్వాడీలతో చర్చలు జరిగాయని వారిపై నమోదైన కేసులను సీఎంతో చర్చించి ఎత్తివేస్తామని మంత్రి తెలిపారు.

సీఎం జగన్ దయవల్లే నూతన సంవత్సర తొలిరోజు రోడ్డుపై ఉన్నాం: అంగన్వాడీ సంఘాల నేతలు

అంగన్‌వాడీల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ను రూ.1.20 లక్షలకు పెంచామని మంత్రి అన్నారు. సహాయకులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను రూ.60 వేలకు పెంచామన్నారు. ఉద్యోగ పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా మారుస్తామన్నారు. చనిపోయిన అంగన్‌వాడీల మట్టి ఖర్చుల కోసం రూ.20 వేలు ఇస్తామని మంత్రి తెలిపారు. సమ్మె కాలంపై ఏం చేయాలో సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామన్నారు. సమ్మె విరమిస్తామని చెప్పినందుకు అంగన్వాడీలకు మంత్రి బొత్స ధన్యవాదాలు తెలిపారు.

అంగన్వాడీల ఉద్యోగాలకు ఎసరు - విధుల్లోంచి తొలగిస్తున్నట్లు నోటీసులు

Anganwadis Strike in 42days: డిసెంబరు 12 నుంచి సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేశారు. రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. 42రోజులగా పోరాటం చేసి కొన్ని డిమాండ్లను సాధించుకోవడం జరిగిందని అంగన్వాడీలు తెలిపారు. సమ్మె కాలంలో వేతనంతో పాటు అంగన్వాడీలపై పెట్టిన కేసులు మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని అంగన్వాడీలు పేర్కొన్నారు.

గడువులోగా విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగిస్తూ ఆదేశాలు

అంగన్‌వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు విఫలం - రేపట్నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలకు పిలుపు

ABOUT THE AUTHOR

...view details