ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు: వైఎస్ షర్మిల - YS Sharmila Blames Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 12:55 PM IST

YS Sharmila Blames CM Jagan and Avinash Reddy: రెండో రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ షర్మిల బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు. వైఎస్ వివేకా హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని షర్మల నిలదీశారు. ఎందుకు అసలు నిజం దాచి పెడుతున్నారని ప్రశ్నించారు.

YS Sharmila Blames CM Jagan
YS Sharmila Blames CM Jagan

బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు: వైఎస్ షర్మిల

YS Sharmila Blames CM Jagan and Avinash Reddy:ముస్లిములకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడు కలవలేదని, కానీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ పార్టీతో అంటగాగుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల రెడ్డి విమర్శించారు. షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.

గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని, బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతాడని షర్మిల ప్రశ్నించారు. జగన్ ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేశాడని గుర్తు చేశారు. ఇమామ్ లకు 15 వేలు వేతనం అన్నాడని, ముస్లీం బ్యాంక్ అంటూ మోసం చేశాడని పేర్కొన్నారు. చనిపోతే 5 లక్షల భీమా అన్నాడు, ఇచ్చాడా అని నిలదీశారు. ముస్లీం పక్షాన నిలబడేది కాంగ్రెస్ మాత్రమేనని షర్మిల అన్నారు. బాబు, జగన్ ఇద్దరు ముస్లీంల పక్షాన లేరని తెలిపారు. బీజేపీ రాష్ట్రానికి ఎం చేసిందని వీళ్లు బానిసలు అయ్యారని వ్యాఖ్యానించారు. విభజన హామీలు ఒక్కటి సైతం బీజేపీ నెరవేర్చలేదని వెల్లడించారు హోదాపై బీజేపీ మోసం చేసిందని, వైఎస్సార్ బతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేదని షర్మిల తెలిపారు. కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ కింద మార్చారని ఎద్దేవా చేశారు. కడప స్టీల్ పరిశ్రమ కోసం సీఎం జగన్ మూడు సార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు.

పదవుల కోసం తమ్ముణ్ని చంపితే వైఎస్సార్ తట్టుకునేవారా?: సునీత - YS Sunitha in Election Campaign

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్క రోజు కూడా కడప స్టీల్ మీద మాట్లాడలేదని షర్మిల విమర్శించారు. వివేకా కేసులో నిందితుడిగా అవినాష్ రెడ్డి మీద ముద్ర వేసిందని గుర్తు చేశారు. నిందితుడిగా ఉన్న అవినాష్​రెడ్డికి మళ్లీ ఎలా టిక్కెట్ ఇచ్చారని జగన్​ను షర్మిల ప్రశ్నించారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని షర్మిల నిలదీశారు. ఎందుకు అసలు నిజం దాచి పెడుతున్నారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు నేరం చేయక పోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారన్నారు. ఈ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. హత్యారాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీబీఐ నిందితుడు అని చెప్తున్న అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడం వల్లే కడప నుంచి తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కడప ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆశీర్వదించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.

నేను బయటకు వెళ్లాక నరికి చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు: సునీత - YS Vivekananda Reddy murder Case

ABOUT THE AUTHOR

...view details