ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై పంచ్​లు- హత్య రాజకీయాలు చేస్తున్న వారికే వైసీపీ టిక్కెట్లంటూ ఎద్దేవా - Sharmila allegations on MLA and MP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 3:35 PM IST

Updated : Apr 7, 2024, 4:19 PM IST

YS Sharmila allegations on MLA, MP: వైసీపీ నేతల భూదాహంతో, అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారని, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు భూమి కోసం శ్రీనివాసులును దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవాపురంలో నాలుగు రోజుల కిందట హత్యకు గురైన శ్రీనివాసులు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.

YS Sharmila allegations on MLA, MP
YS Sharmila allegations on MLA, MP

YS Sharmila allegations on MLA, MP: వైసీపీ నాయకుల భూకబ్జాలు భూతగాదాలతో అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలంలోని యాదవాపురంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరులే శ్రీనివాసులును భూమికోసం దారుణంగా హత్య చేశారని షర్మిల ఆరోపించారు.

వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవాపురంలో నాలుగు రోజుల కిందట హత్యకు గురైన బీసీ శ్రీనివాసులును వైసీపీ నాయకులు హత్య చేశారు. ఆ బాదిత కుటుంబాన్ని షర్మిల ఇవాళ పరామర్శించి ఓదార్చారు. షర్మిల ఓదార్చుతున్నంతసేపు బాధితులు కన్నీటి సంద్రమయ్యారు.భూమి కోసం అవినాష్ అనుచరులు శ్రీనివాస్ యాదవ్‌ను రాళ్లతో కొట్టి చంపేశారని షర్మిల ఆరోపించారు. పోలీసులు, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. నిందితులు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులని, ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని షర్మిల నిలదీశారు.


బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు: వైఎస్ షర్మిల - YS Sharmila Blames Jagan

మా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఎర్ర గంగిరెడ్డి ఇదంతా చేశాడనే విధంగా మాట్లాడడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర గంగిరెడ్డి సాక్షాధారాలు తారుమరు చేస్తుంటే అవినాష్ రెడ్డి అంత అమాయకంగా ఎందుకు చూస్తున్నాడని ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న వ్యక్తికి అది కూడా తెలియద అని షర్మిల ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చానని మేనమామ మాట్లాడుతున్నారన్న షర్మిల, అక్కడ కేసీఆర్ ని ఓడించామని ఏపీలో నా పని పడటంతోనే ఇక్కడికి వచ్చానని చురకలు అంటించారు. ఇలాంటి హత్య రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్యే ఎంపీలకు మళ్లీ వైసీపీ టికెట్లు ఎలా ఇస్తారని షర్మిల నిలదీశారు. శ్రీనివాసులు కుటుంబాని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


వివేకా హత్యతో సంబంధం లేదని అవినాష్‌ అప్పుడే చెప్పొచ్చు కదా: షర్మిల - YS Sharmila on MP Avinash Reddy

తమకు ఓట్లేసిన వారిని కూడా ఈ నాయకులు వదలట్లేదని షర్మిల మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఎస్‌ వదిలివెళ్లిన కడప స్టీల్‌ ప్లాంట్‌ను శంకుస్థాపనల ప్రాజెక్టుగా జగన్‌ మార్చారని ఎద్దేవా చేశారు. వైఎస్‌ వదిలివెళ్లిన ప్రాజెక్టులను జగన్‌రెడ్డి ముందుకు తీసుకెళ్లారా? అని ప్రశ్నించారు. కడప స్టీల్ పరిశ్రమ పూర్తయి ఉంటే వేలమందికి ఉద్యోగాలొచ్చేవని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని జగన్‌రెడ్డి అన్నారు చేశారా అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ వేస్తానన్న జగన్‌ రెడ్డి, దగా డీఎస్సీ వేశారని విమర్శించారు. జగన్‌ రెడ్డి, ఒక్క వర్గాన్నయినా పట్టించుకున్నారా? అంటూ విమర్శలు గుప్పించారు.

షర్మిలలో వైఎస్సార్ గుణ గణాలు: వైఎస్ వివేకా ను పక్కన పెట్టాలి అని చూశారని, అయినా ప్రజా సేవలో ఉన్నాడని పథకం ప్రకారం హత్యచేశారని ఆయన కుమార్తె సునీత ఆరోపించారు. వివేకా కోరిక వైఎస్ షర్మిలను ఎంపీగా చూడాలని, షర్మిల ను చూస్తే వైఎస్సార్ గుర్తుకు వస్తాడని తెలిపారు. వైఎస్సార్ గుణ గణాలు అన్ని షర్మిల లో ఉన్నాయని పేర్కొన్నారు. షర్మిల ఉంటే వైఎస్సార్ ఉన్నట్లు ఉంటుదని వివేకా అనుకున్నారని తెలిపారు. వివేకా హత్య పర్సనల్ విషయం అని మాట్లాడుతున్నారని, సజ్జల అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారనీ సునీత ఆగ్రహ వ్యక్తం చేశారు. సలహా దారు అంటే ఎలా ఉండాలో ముందు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. మా నాన్న ను చంపితే నాకు పర్సనల్ ఇష్యూ ఎలా అవుతుందని మండిపడ్డారు.

LIVE: కమలాపురంలో వైఎస్ షర్మిల న్యాయ యాత్ర- ప్రత్యక్షప్రసారం - Sharmila Election Campaign live

హత్య రాజకీయాలు చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీలకు టికెట్ ఇస్తున్నారు: వైఎస్ షర్మిల
Last Updated :Apr 7, 2024, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details