ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నచ్చిన పార్టీకి ప్రచారం చేసే హక్కు నాకుంది : టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం - Komati jayaram Reply to EC

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 10:05 AM IST

Komati Jayaram Reply To CEO MK Meena Notice: నచ్చిన పార్టీకి ప్రచారం చేసే ప్రాథమిక హక్కు ఎన్నారైగా తనకు ఉందని తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం సమన్వయకర్త కోమటి జయరాం స్పష్టం చేశారు. తాను భారత దేశ చట్టాల్ని గౌరవిస్తూ, పాటిస్తున్నట్టు వెల్లడించారు.

Komati Jayaram Reply To CEO MK Meena Notice
Komati Jayaram Reply To CEO MK Meena Notice

Telugu Desam Party NRI Unit Co Ordinator Komati Jayaram Reply To CEO MK Meena Notice : నచ్చిన పార్టీకి ప్రచారం చేసే ప్రాథమిక హక్కు ఎన్నారైగా తనకు ఉందని తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం సమన్వయకర్త కోమటి జయరాం స్పష్టం చేశారు. తాను భారత దేశ చట్టాల్ని గౌరవిస్తూ, పాటిస్తున్నట్టు వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఎన్నారై విభాగం నాయకులతో నిర్వహించిన సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను కావాలనే అధికార పార్టీ నాయకులు వక్రీకరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

CEO MK Meena Notice To Komati Jayaram :ఆ సమావేశంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేలా మాట్లాడారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఏఎస్‌ఎస్‌ మూర్తి (ASS Murthy) ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఈవో ఎంకే మీనా (CEO MK Meena) జయరాంకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుపై జయరాం వివరణ ఇచ్చారు. ఎన్నారైలతో నిర్వహించిన సమావేశం రహస్యంగా జరిగింది కాదని, తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం సభ్యుడిగా సహచర ప్రవాసాంధ్రులను పార్టీ కోసం పని చేయాలని అభ్యర్థించానని గుర్తు చేశారు.

ముగిసిన నామినేషన్ల గడువు- 13న పోలింగ్​ రేసులో నిలిచేదెవరో! - elections nominations

ప్రభుత్వ సలహాదారులపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు :రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించామని, సొంత నిధులను వినియోగించాలని సూచించామని కోమటి జయరాం తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వివిధ వర్గాలకు జరిగిన మేలును ప్రచారం చేయడమే తమ లక్ష్యమని కోమటి జయరాం పేర్కొన్నారు. తాను ప్రభుత్వ సలహాదారులపై తప్పుడు వ్యాఖ్యలు చేశానని, ప్రజలకు లంచాలు ఇచ్చి ప్రభావితం చేయాలని చూశామని చెప్పడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రచారంలో ప్రభుత్వ సిబ్బంది - ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు - TDP Complained to EC on Govt Staff

వాస్తవాలను పరిశీలించి చర్యలు నిలిపివేయాలని విన్నపం : ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నానని, ఏనాడూ నిబంధనలు ఉల్లంఘించలేదని జయరాం వివరణ ఇచ్చారు. తనపై అధికార పార్టీ వాళ్లు చేసిన ఉద్దేశపూర్వక ఫిర్యాదులో వాస్తవాలను పరిశీలించి తదుపరి చర్యలు నిలిపివేయాలని సీఈవోను కోరారు.

ఆ కేసులో బోండా ఉమాను ఇరికించాలని చూస్తున్నారు - ఈసీకి కనకమేడల లేఖ - TDP leader Kanakamedala Ravindra

ABOUT THE AUTHOR

...view details