ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు- ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ కొట్టివేత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 12:27 PM IST

Telangana HC Verdict On MLCs : తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇద్దరు ఎమ్మెల్సీ నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ కొట్టివేసింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని ధర్మాసనం సూచించింది.

telangana_high_court_on_mlc_election
telangana_high_court_on_mlc_election

Telangana HC Verdict On MLCs :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఇద్దరు ఎమ్మెల్సీ నియామకాలపై తెలంగాణ సర్కార్ ఇచ్చిన గెజిట్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం గెజిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాలని ధర్మాసనం సూచించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసింది.

కేజ్రీవాల్​కు కోర్టు సమన్లు- మార్చి 16న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమరుల్లా ఖాన్ ​ను తమిళిసై సౌందర రాజన్ నియమించారు. గవర్నర్ ఆమోదం తెలపడంతో నోటిఫికేషన్ విడుదలైంది. కాగా, 2023 జులై 31న దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి బీఆర్​ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. కాగా, వారికి రాజకీయ నేపథ్యం ఉందంటూ సెప్టెంబర్ 25న ఇద్దరి పేర్లను గవర్నర్​ తిరస్కరించారు. నిబంధనల ప్రకారం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఆమోదించలేమని గవర్నర్ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

హైకోర్టులో సర్కారు అబద్ధాలు - క్షమాపణలు కోరిన ఏజీ శ్రీరామ్‌

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్ అలీఖాన్‌ను ఎంపిక చేసింది. వీరిద్దరి పేర్లను గవర్నర్​ ఆమోదించడం నిబంధనలకు వ్యతిరేకమని బీఆర్​ఎస్​ నేతలు శ్రవణ్‌, సత్యనారాయణ హైకోర్టులో సవాల్​ చేశారు. జీవో 12ను సవాలు చేస్తూ, కొత్తగా ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ప్రతివాదులుగా చేర్చాలని కోరారు. ఈ నేపథ్యంలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారోత్సవం వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయవద్దని ఆదేశించింది.

'రాత్రి నిద్రపోవడం లేదని 600 మంది ఓట్లు తొలగింపు'- ఓటు హక్కు ఇవ్వడానికి నరకం చూపిస్తున్న అధికారులు

గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణను గవర్నర్ కోటాలో తమ ప్రభుత్వం నామినేట్ చేస్తే రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్​, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం పేరును ఎలా ఆమోదిస్తారని మాజీ మంత్రి కేటీఆర్​ ప్రశ్నించారు. శ్రవణ్, సత్యనారాయణ విషయంలో కనిపించిన రాజకీయ నేపథ్యం, కోదండరాం విషయంలో కనిపించట్లేదా అని మండిపడ్డారు. గవర్నర్ రాష్ట్ర ప్రజలకు బాధ్యులు కానీ, రేవంత్ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు నిర్ణయం తీసుకున్నారా అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం - ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెడుతున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details