ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏ సోదరికి ఉండకూడని అన్న జగన్ - సొంత చెల్లెని నిందించే వ్యక్తిని ఏమనాలి? : టీడీపీ - GV Anjanenulu fire on jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 12:30 PM IST

Palnadu District TDP President GV Anjaneyulu : సీఎం జగన్​ మోహన్​ రెడ్డిపై పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ లాంటి వ్యక్తి ఏ చెల్లికీ అన్నగా ఉండకూడదని అన్నారు. బాబాయి హత్య నిందితులను చంకన పెట్టకుని పోషిస్తున్నారని జీవీ మండిపడ్డారు.

gv_anjaneyulu
gv_anjaneyulu

Palnadu District TDP President GV Anjaneyulu : ఏ చెల్లికీ అన్నగా ఉండడానికి అర్హత లేని వ్యక్తి జగన్ అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. సొంత చెల్లెల్ని నిందించే వ్యక్తిని ఏమనాలి ? అని ఆయన ప్రశ్నించారు. బాబాయి హత్య కేసు నిందితుడిని చంకలో పెట్టుకోవడమే గాకుండా ఎన్నికల్లో టికెట్​ ఇచ్చి మంచోడని ఎలా సర్టిఫికెట్​ ఇస్తున్నారని నిలదీశారు. వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసన్న జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అధికారంలో ఉన్న ఐదేళ్లుగా ఏం చేశారు? అని జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. సీబీఐ అరెస్టు చేసి బెయిల్‌పై ఉన్న వ్యక్తి మంచోడయ్యాడా? జగన్‌, అవినాష్ మళ్లీ గెలిస్తే హంతకులకు లైసెన్స్ ఇచ్చినట్లే అని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details