తెలంగాణ

telangana

ప్రచారం ముగిసేలోగా డీకే అరుణ బండారం బయటపెడతా : వంశీచంద్‌ రెడ్డి - Vamshi Chand Fire on DK Aruna

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 10:59 PM IST

Congress MP Candidate Vamshi Chand Fire on DK Aruna : ఎంపీ ఎన్నికల ప్రచారం ముగిసేలోపు బీజేపీ నాయకురాలు డీకే అరుణ బండారం బట్టబయలు చేస్తానని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. వంశీచంద్‌రెడ్డిది నాన్‌-లోకల్‌ అని డీకే అరుణ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆమెపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Vamshi Chand Comments on DK Aruna
Congress MP Candidate Vamshi Chand Fire on DK Aruna

Congress MP Candidate Vamshi Chand Fire on DK Aruna : పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం ముగిసేలోపు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ బండారం బయట పెడతానని మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ పార్లమెంట్​ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. డీకే అరుణది పూటకో పార్టీ మారే అవకాశవాద రాజకీయమని, కష్టం వచ్చినా, నమ్మిన సిద్ధాంతంతో పార్టీకి కట్టుబడే ఉండి విలువల రాజకీయం చేయడం తనదనేనని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశీచంద్‌రెడ్డిది నాన్‌-లోకల్‌ అని డీకే అరుణ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు.

Vamshi Chand Comments on DK Aruna :డీకే అరుణను గద్వాలలో బీసీ ద్రోహి అని ఇప్పటికే అక్కడి ప్రజలు చెబుతున్నారని వంశీచంద్ రెడ్డి అన్నారు. గతంలో కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆమె తన ఓటమికి కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ ఎన్నికలలో తనను ఎలాగైనా ఓడగొట్టలనే దిగజారుడు విమర్శలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కుసంస్కార రాజకీయాలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలని హితువు పలికారు. డీకే అరుణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రచారం ముగిసేలోగా డీకే అరుణ బండారం బయటపెడతా : వంశీచంద్‌ రెడ్డి

'మహబూబ్‌నగర్‌ ప్రజల్ని మళ్లీ మోసం చేయడానికి వస్తుంది. డీకే అరుణకు మహబూబ్‌నగర్‌ ప్రజలు ఓట్లేస్తే మన పరిస్థితి మహబూబ్‌నగర్‌ నుంచి భూత్పూర్​ రోడ్డులాగా అవుతుంది. కుట్రలు, దుర్దేశం మనసలో ఉంచుకుని, ఎట్లైన వంశీచంద్​రెడ్డి గెలుస్తాడని ఓడగొట్టడానికి కుట్ర చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమెను గౌరవ ఇచ్చా. కానీ నిన్న ఆమె మాట్లాడిన మాటలకు అవన్నీ కూడా మర్చిపోతున్నా. మే 11 సాయంత్రంలోపు డీకే అరుణ బండారం బయట పెడతా.'-వంశిచంద్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనానికి కారణమేంటో చెప్పాలి? : కిషన్‌రెడ్డి - Kishan Reddy Slams KCR

నేను చేరలేని దూరం కాదు - దొరకనంత దుర్గం కాదు - సామాన్య జనానికి సైతం అందుబాటులో ఉంటా : సీఎం రేవంత్​ - CM Revanth on Common People

ABOUT THE AUTHOR

...view details