తెలంగాణ

telangana

వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Slams YSRCP

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 2:59 PM IST

Chandrababu Slams YSRCP : ఏపీలోని ఒంగోలులో టీడీపీ నేతపై దాడి ఘటనను పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందన్న ఆయన, ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ హింసా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

Chandrababu Fires on YSRCP
Chandrababu Fires on YSRCP

వైసీపీది రౌడీయిజం ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు

Chandrababu Slams YSRCP :ఆంధ్రప్రదేశ్ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Comments on YCP)ధ్వజమెత్తారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించిందన్నారు.

YSRCP Leaders Attack on TDP : ఆ కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం నేత మోహన్‌పై మూకుమ్మడి దాడి చేశారని చంద్రబాబు ఆరోపించారు. గాయపడిన మోహన్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా అక్కడా బీభత్సం సృష్టించి ఆసుపత్రిని ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. దాడి సమయంలో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీసు అధికారుల వైఖరి ఏంటో తెలియజేస్తోందని చంద్రబాబు అన్నారు.

బెజవాడలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత అక్రమాలు- బూడిదతో సైతం కాసులు రాల్చుకునే ఘనుడు

AP Elections 2024 :దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాంతి భద్రతలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న వైసీపీ అరాచకాలపై, అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొందరు పోలీసుల అధికారులపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని కోరారు. మోహన్‌రావుపై దాడి చేసిన రౌడీలపై ప్రకాశం జిల్లా ఎస్పీ సుమిత్‌ సునీల్‌ కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

"ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోంది. రౌడీయిజం చేయకపోతే పూటగడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఒంగోలులో వైసీపీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్‌ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించింది. ఆ కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం నేత మోహన్‌పై మూకుమ్మడి దాడి చేశారు. గాయపడిన మోహన్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా అక్కడా బీభత్సం సృష్టించి ఆసుపత్రిని ధ్వంసం చేశారు. ఈ దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణం. దాడి సమయంలో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీసు అధికారుల వైఖరి ఏంటో తెలియజేస్తోంది."- చంద్రబాబు, టీడీపీ అధినేత

బాలినేనికి అలవాటే : ఎన్నికల్లో సానుభూతి కోసమే బాలినేని శ్రీనివాసరెడ్డి నాటకాలాడుతున్నారని టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు కమ్మపాలెంలో ఉద్రిక్తతలు సృష్టించారని, ఈసారి ఒంగోలు సమతానగర్‌లో గొడవలు సృష్టించారని దుయ్యబట్టారు. బాలినేని కోడలు ప్రచారానికి వెళ్లి కరపత్రాలు ఇచ్చారన్నారు. కుల రాజకీయాలు చేసి కేసులతో ఇబ్బంది పెట్టడం బాలినేనికి అలవాటేనని ఆక్షేపించారు. చికిత్స కోసం బాధితులను చేర్పిస్తే దౌర్జన్యం చేయిస్తున్నారని దామచర్ల జనార్ధన్ ధ్వజమెత్తారు.

వైసీపీ కోడ్‌ అమలు చేస్తున్న ఖాకీలు - జగన్‌ భక్త అధికారుల అత్యుత్సాహం - AP Elections 2024

అరాచక 'గ్రంథం' - గోదావరి జిల్లాల్లో పేట్రేగిపోతున్న వైసీపీ నేత - YSRCP Leader Irregularities

ABOUT THE AUTHOR

...view details