ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రావణాసురుడి పాలనకు అంతం పలకాల్సిన సమయం వచ్చింది: చంద్రబాబు - Madanapalle Praja Galam meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 10:30 PM IST

Updated : Mar 28, 2024, 6:22 AM IST

Chandrababu fires on YCP: బాబాయిని గొడ్డలితో చంపిన వ్యక్తులతో జగన్ తిరుగుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. మదనపల్లెలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. చెల్లెళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పాకే జగన్‌ ఓటు అడగాలని స్పష్టం చేశారు. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.

Chandrababu fires on YCP
Chandrababu fires on YCP

రావణాసురుడి పాలనకు అంతం పలకాల్సిన సమయం వచ్చింది: చంద్రబాబు

Chandrababu fires on YCP:దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం జగన్ తన బాబాయిని గొడ్డలితో చంపిన వ్యక్తులతో తిరుగుతున్నారని, చెల్లెళ్ల ప్రశ్నలకు జవాబు చెప్పాకే ఓటు అడగాలని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు డిమాండ్ చేశారు. తాను రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనేక నిందలు భరిస్తున్నట్లు వెల్లడించారు. దుర్మార్గాలు చేసే వారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

ఇప్పటికి సూపర్‌సిక్స్‌ పథకాలు ప్రకటించానన్న చంద్రబాబు, ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్క మహిళకు రూ.1500 ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద చదివే ప్రతి పిల్లవాడి తల్లికి రూ.15 వేలు ఇస్తామని వెల్లడించారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక విద్యుత్‌ బాదుడు ఉండదన్న చంద్రబాబు, జాబు రావాలంటే, బాబు రావాలనే నినాధాన్ని ఇచ్చారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

టిక్కెట్ రాని ఆశావహులకు కీలక పదవులు ఇచ్చిన చంద్రబాబు - Key Posts for TDP Leaders

పెద్దిరెడ్డికి ఇసుకే ఉదయం అల్పాహారం, మైన్స్‌ మధ్యాహ్న భోజనం అంటూ ఎద్దేవా చేశారు. జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి పాలన జరుగుతోందని విమర్శించారు. కాంట్రాక్టులన్నీ పెద్దిరెడ్డే తీసుకుంటున్నారని, ఇసుకను బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రౌడీయిజం కావాలో ప్రజాస్వామ్య పాలన కావాలో తేల్చుకోవాలన్నారు. ఒంటిమిట్టలో సుబ్బారావు భూమిని రికార్డుల్లో మాయం చేశారని, మనస్తాపంతోనే సుబ్బారావు రైలు కిందపడి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

కూటమి అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛన్‍: చంద్రబాబు - Chandrababu Tour in Kuppam

రాబోయే రోజులు అన్ని టీడీపీ రోజులే అని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ చూసిన సాగునీరు లేని రైతులు, నిరుద్యోగ యువత కనపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇది కీలక సమయమని, ఇంకా ఏడు వారాలు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఓటింగ్ రోజు మనసాక్షిగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సీఎం బటన్ నొక్కినది ఎంత, బొక్కింది ఎంతో చెప్పాలన్నారు. రావణాసురుడి పాలనకు అంతం పలకాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. నెలకు రూ. 100 ఇచ్చి 1000 లాకున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరించడానికి ప్రజల ముందుకు వచ్చినట్లు తెలిపారు.

టీడీపీ ఎన్నికల ప్రచారం షురూ - నేటి నుంచి ప్రజల్లోకి చంద్రబాబు - Chandrababu Election Campaign

Last Updated :Mar 28, 2024, 6:22 AM IST

ABOUT THE AUTHOR

...view details