ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉమ్మడి రాజధానికి మరో రెండేళ్లంటే- ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమినట్లా?: వైఎస్​ షర్మిల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 1:43 PM IST

APCC Chief YS Sharmila Fire on CM Jagan: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సీఎం జగన్​పై వైఎస్​ షర్మిల విరుచుకుపడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వైఎస్సార్సీపీ అరాచకాలను ఎండగడుతున్నారు. తాజాగా ఉమ్మడి రాజధానికి మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా అని సీఎం జగన్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

APCC_Chief_YS_Sharmila_Fire_on_CM_Jagan
APCC_Chief_YS_Sharmila_Fire_on_CM_Jagan

APCC Chief YS Sharmila Fire on CM Jagan: వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ చీఫ్​ వైఎస్​ షర్మిలా రెడ్డి ధ్వజమెత్తారు. ఉమ్మడి రాజధానికి మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా అని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిన జగనన్న.. పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే 'ఉమ్మడి రాజధాని అంశం' అని మండిపడ్డారు.

రాజధాని ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి: షర్మిల

ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సర్కార్ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా అని ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ(PM Modi)కి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే తప్ప విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదని, ప్రత్యే హోదా రాలేదని మండిపడ్డారు.

"జగన్​ను నమ్మి ఓటేస్తే ఇచ్చిన హామీలన్నీ పక్కనపెట్టారు"

ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే మరో 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్​ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు లేవని, పోలవరం పూర్తి కాలేదన్న ఆమె.. ఎన్నికల ముందు జగనన్న ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్​గా మార్చేరే తప్పా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించలేదన్నారు.

వైఎస్సార్​సీపీలో YSR అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణా రెడ్డి : షర్మిల వ్యంగ్యాస్త్రాలు

"వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే.. ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా?. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?. పూటకో మాట, రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే మరో 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి రాజధాని లేదు.. ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక ప్యాకేజీలు లేవు..పోలవరం పూర్తి కాలేదు. కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకూ దిక్కులేదు. కొత్త పరిశ్రమలు లేవు.. ఉన్నవి ఉంటాయో లేదో తెలియదు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారే తప్పా అభివృద్ధి చూపలేదు." - వైఎస్​ షర్మిల, ఏపీసీసీ చీఫ్

ABOUT THE AUTHOR

...view details