ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌- నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మీనా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 4:41 PM IST

Updated : Mar 20, 2024, 6:49 PM IST

AP CEO Mukesh Kumar Meena on Election Rules: మూడు రోజులుగా బహిరంగ ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు అన్నీ కలిపి 1.99 లక్షల మేర తొలగించామని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు అనుమతి లేకుండా ప్రచారాలు, రోడ్‌షోలు చేయడానికి వీల్లేదని ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ap_ceo_on_election_rules
ap_ceo_on_election_rules

AP CEO Mukesh Kumar Meena on Election Rules:రాష్ట్ర సచివాలయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా (AP CEO Mukesh Kumar Meena) డీజీపీ కేవీ రాజేంద్రనాధ్ రెడ్డి, సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఈ సమీక్షలో సైబర్ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, సెక్యూరిటీ, కమ్యునికేషన్ ప్లాన్, కంప్లైంట్ రిడ్రస్సల్, ఓటరు హెల్ప్ లైన్, పోలింగ్ కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖేష్​ కుమార్​ మీనా మాట్లాడుతూ మూడు రోజులుగా బహిరంగ ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు తొలగించామని తెలిపారు. నిబంధనల ఉల్లంఘించిన వారిపై 3 రోజుల్లో 385 కేసులు నమోదు చేశామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌- నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మీనా

సీ విజిల్‌ యాప్​ ద్వారా ఫిర్యాదులు:మద్యం నిల్వలకు సంబంధించి సీ విజిల్‌ యాప్​ ద్వారా 1307 ఫిర్యాదులు వచ్చాయని సీఈవో అన్నారు. ఈ యాప్​ ద్వారా ఫిర్యాదుల నమోదుతో 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఇప్పటి వరకు 74 శాతం సమస్యలు పరిష్కరించామని అన్నారు. ఈ సీ విజిల్ యాప్​ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు అనుమతి లేకుండా ప్రచారాలు, రోడ్‌షోలు చేయడానికి వీల్లేదని ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కుతున్న వైసీపీ నాయకులు- అధికారుల వైఫల్యంపై విమర్శల వెల్లువ

ఎన్నికలలో పోటీ చేసే పార్టీలు తమ ప్రచారం కోసం సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు అనుమతుల కోసం 3 రోజుల్లో 388 దరఖాస్తులు వచ్చాయని వాటిపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. వాలంటీర్లు, వీఆర్‌వోలు, ఒప్పంద సిబ్బందిపై ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదు వచ్చిన ఒప్పంద సిబ్బందిని తొలగించి, రెగ్యులర్‌ ఉద్యోగులను సస్పెండ్‌ చేశామని మీనా అన్నారు. కొన్ని విషయాల్లో క్రిమినల్‌ కేసులు పెట్టామని తెలిపారు. నిన్నటి వరకు 46 మందిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు వాలంటీర్లపై 40 కేసులు ఉన్నాయని తెలిపారు.

జగన్ బొమ్మలు కవర్ చేసేందుకు అవస్థలు- వైసీపీ ప్రచార పిచ్చితో ఉద్యోగుల పాట్లు

ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు:వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదని పోలింగ్‌ ఏజెంట్లుగా పని చేయకూడదని అన్నారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో తిరగకూడదని హెచ్చరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు అన్నీ కలిపి 1.99 లక్షల మేర తొలగించామని తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై ఇప్పటి వరకు 385 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామని సీఈవో అన్నారు. గత మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, రూ.1.69 కోట్ల విలువైన మద్యం పట్టుకున్నామని తెలిపారు. మద్యం ఉత్పత్తి, విక్రయాలపై దృష్టి పెట్టామని ప్రస్తుతం 173 బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో పాల్గొంటున్నాయని సీఈవో ముఖేష్​ కుమార్​ మీనా తెలిపారు.

యథేచ్ఛగా వైఎస్సార్సీపీ కోడ్ ఉల్లంఘన- ఈసీ ఆదేశాలు బేఖాతరు!

సీఈసీ సూచన మేరకు డీఎస్సీ నిర్వహణ: ఇటీవల జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీ సభలో భద్రతా లోపాలపై ఫిర్యాదు వచ్చిందని దానిని కేంద్రానికి పంపించామని సీఈవో అన్నారు. ఆ అంశం హోం శాఖ పరిధిలో ఉందని తెలిపారు. అలానే పవన్ కల్యాణ్ గాజు గ్లాసు చూపించిన అంశంపై ఎలాంటి నిషేధం లేదని తెలిపారు. ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చని అన్నారు. ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించిన తరువాత తదుపరి నిర్ణయం ఉంటుందని మీనా తెలిపారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని చాలా మంది అభ్యర్థులు ఫిర్యాదులు చేస్తున్నారని ఇప్పటి వరకూ 1000కి పైగా ఫిర్యాదులు అందాయన్నారు. ఈ అంశంపై నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు నడుచుకుంటామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా డీఆర్వో తోపాటు మరో డీఆర్వోపై కూడా చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో హింసాత్మక చర్యలను సీరియస్‌గా తీసుకుంటామన్న మీనా రేపు ప్రకాశం, పల్నాడు, నంద్యాల ఎస్పీలను పిలిపించి వివరణ కోరతామన్నారు.

Last Updated : Mar 20, 2024, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details