ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నారాయణ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు- బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ - ap politics

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 7:31 PM IST

AP government against Narayan educational institutions : నారాయణ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. నెల్లూరు పోలీసుల ఆదేశాల మేరకు హైదరాబాద్​లో నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన ఐసీఐసీఐ బ్యాంకు నాలుగు ఖాతాలను ఫ్రీజ్ చేశారు.

former_minister_narayana
former_minister_narayana

AP government against Narayan educational institutions : మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన ఖాతాలపై దృష్టి పెట్టిన నెల్లూరు పోలీసులు హైదరాబాద్ లోని ఐసీఐసీఐ బ్యాంకు అధికారులకు లేఖలు రాశారు. హిమాయత్ నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన నాలుగు ఖాతాలను స్తంభింపజేయాలని కోరారు. పోలీసుల ఆదేశాల మేరకు బ్యాంకు అధికారులు ఆ నాలుగు ఖాతాలను స్తంభింపజేశారు.

వైెస్సార్​సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది - మాజీ మంత్రి నారాయణ ఇంట్లో సోదాలపై టీడీపీ నేతలు

2023లో 92 బస్సుల కొనుగోలుకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలతో నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజ్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ పునీత్ కోటప్ప కుట్ర పూరితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతున్నందున హిమాయత్ నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న ఖాతాల్లోని నిధులు దారి మళ్లించకుండా నియంత్రించేందుకు ఖాతాలను స్తంభింపజేయాలని నెల్లూరు పోలీసు ఉన్నతాధికారులు బ్యాంకు అధికారులను ఆదేశిస్తూ లేఖలు రాశారు. పోలీసుల సూచనలతో ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన నాలుగు ఖాతాలను స్తంభింపజేశారు.

రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణ బంధువుల పిటిషన్‌పై ముగిసిన విచారణ

బస్సులు కొనుగోలులో జీఎస్టీ (GST) చెల్లించలేదంటూ మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్​పై నమోదైన కేసులో ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. బస్సులు కొనుగోలు చేసి జీఎస్టీ చెల్లించలేదన్న ఆరోపణలతో పునీత్​పై కేసు నమోదు కాగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన న్యాయస్థానం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ పై కేసు నమోదు చేసిన నెల్లూరు, బాలాజీ నగర్ పోలీసులు ఇన్​స్పైర్ మేనేజ్​మెంట్ సర్వీసెస్ పేరుతో బస్సులు కొనుగోలు చేసి జీఎస్టీ చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసును కొట్టేయాలని కోరుతూ పునీత్ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం విచారించింది. పునీత్​పై అరెస్ట్‌తోపాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ దర్యాప్తు కొనసాగించవచ్చని సూచించింది.

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణకు మరోసారి నోటీసులు

ABOUT THE AUTHOR

...view details