Prabhas take Break : వరుస ఫ్లాప్స్‌లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్గా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్'తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేజీయఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో మరో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. అయితే ప్రభాస్ ఇప్పుడు షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాస్త రెస్ట్ తీసుకొని హెల్త్‌పై దృష్టి సారించేందుకు డార్లింగ్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న నెటిజన్లు ప్రభాస్ హీరోయిన్ సమంతను ఫాలో అవుతున్నారని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. సమంత కూడా ఈ మధ్య సినిమాల షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ 'సిటాడెల్' డబ్బింగ్ వర్క్‌తో మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్‌లోకి అడుగుపెట్టింది.
Prabhas Upcoming Movies :ఇకపోతే ప్రభాస్ త్వరలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి'తో(Prabhas Kalki Movie) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్‌ను రీసెంట్గా పూర్తి చేశారు ప్రభాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్ వంటి భారీ తారాగాణం నటించారు. దీని తర్వాత ప్రభాస్ మారుతి డైరెక్షన్లో రాజాసాబ్గా(Prabhas Rajasaab) రాబోతున్నారు. ఇది హారర్ కామెడీగా రాబోతుంది. ఇందులో ముగ్గురు కథనాయికలు నటిస్తున్నారు. అనంతరం అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్ చిత్రంలో నటించనున్నారు డార్లింగ్. ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. వీటితో పాటే భారీ హైప్ నెలకొన్న 'సలార్ 2' కూడా పట్టాలెక్కించాల్సి ఉంది. ఈ లైనప్ మొత్తం పూర్తయ్యేసరికి మరో రెండు మూడేళ్లు కచ్చితంగా పడుతుంది.