తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పెళ్లికి ముందే నమ్రతకు మహేశ్​ కండీషన్​- వీరి ప్రేమ కహానీ తెలుసా?

Mahesh Babu Namrata Wedding Anniversary : టాలీవుడ్​లోనే​ క్యూటెస్ట్​ కపుల్​ సూపర్​స్టార్ మహేశ్​ బాబు- నమ్రతా శిరోద్కర్ జంట.​ ఇదిలా ఉంటే వీరిద్దరి పెళ్లి జరిగింది వాలంటైన్​ వీక్​లోనే కావడం స్పెషల్​. టెడ్డీ​ డే రోజునే వీరు ఇద్దరూ ఒక్కటయ్యారు. అయితే ఈ దంపతులు తాజాగా తమ 19 ఏళ్ల వివాహ బంధంలో నుంచి 20వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఈ క్యూట్​ కపుల్​ పెళ్లికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్​ విషయాలు నెట్టింట వైలరవుతున్నాయి.

Mahesh Babu - Namrata Wedding Anniversary
Mahesh Babu - Namrata Wedding Anniversary

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 11:32 AM IST

Mahesh Babu Namrata Wedding Anniversary :సూపర్​స్టార్ మహేశ్​ బాబు- నమ్రత శిరోద్కర్​ దంపతులకు టాలీవుడ్‌లో మోస్ట్‌ లవబుల్‌ అండ్‌ బెస్ట్ కపుల్​గా పేరుంది. అయితే ఈ జంట పెళ్లి చేసుకుంది వాలంటైన్​ వీక్​లో నాలుగో రోజైన టెడ్డీ​ డే రోజునే కావడం విశేషం. శనివారం వీరిద్దరూ తమ 19 ఏళ్ల వివాహ బంధం నుంచి 20వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో నమ్రత అంతకుముందు చేసిన కామెంట్స్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్యూట్​ కపుల్​ పెళ్లికి సంబంధించిన ఆ ఆసక్తికరమైన అంశాలు ఏంటో తెలుసుకుందాం.

నమ్రతకు మహేశ్​ కండీషన్​
మహేశ్​-నమ్రతలది ప్రేమ పెళ్లి (Mahesh Babu Namrata Love Story) అన్న విషయం అందరికి తెలిసిందే. 2000 సంవత్సరంలో బీ.గోపాల్​ దర్శకత్వంలో వచ్చిన 'వంశీ' సినిమాలో వీరిద్దరు నటించారు. అలా సినిమా షూటింగ్​ సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం 5ఏళ్ల పాటు డేటింగ్​లో ఉన్నారు. ఆ తర్వాత ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు.

పెళ్లికి ముందు నమ్రత కూడా హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. దీంతో పెళ్లి కన్నా ముందే ఇండస్ట్రీకి గుడ్​బై చెప్పి హౌస్​వైఫ్​గా ఉండాలని నమ్రతను కోరారట మహేశ్. దీనికి అంగీకరించిన నమ్రత, పెళ్లిపీటలు ఎక్కేకన్నా ముందే అప్పటికే పెండింగ్​లో ఉన్న సినిమాలను చకచకా పూర్తి చేసి మహేశ్​తో మెడలో మూడు ముళ్లు వేయించుకున్నారు.

'ఆయనకు రావాల్సిన భార్య విషయంలో మహేశ్​ చాలా క్లారిటీతో ఉండేవారు. ఉద్యోగం చేయని అమ్మాయి జీవిత భాగస్వామిగా రావాలని కోరుకున్నారు. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న నన్ను సినిమాలు మానేయాలని అడిగారు. అలాగని నేను ఏదైనా ఆఫీస్​లో పనిచేసినా సరే దానిని మానేసి ఇంట్లో చక్కగా పిల్లలను చూసుకొమని చెప్పారు. అలా పెళ్లి విషయంలో తన అభిప్రాయాన్ని పెళ్లికి ముందే తెలిపారు మహేశ్​. ఇలా కొన్ని విషయాల్లో మేము ఒకరికొకరము త్యాగం చేసుకున్నాం' అని నమ్రత చెప్పుకొచ్చారు.

మహేశ్​కు నమ్రత కండీషన్​
ముంబయికి చెందిన నమ్రతకు హైదరాబాద్​ లాంటి సిటీల్లో ఉండే పెద్ద బంగ్లాల్లో ఉండే అలవాటు లేదట. దీంతో పెళ్లి తర్వాత తనతో హైదరాబాద్​కు రావాలంటే ముందుగా తాను కాస్త అడ్జెస్ట్​ అయ్యేంత వరకు ఓ అపార్ట్​మెంట్​లో ఉంచాలని మహేశ్​ను కోరారట నమ్రత. దీనికి మహేశ్​ కూడా ఓకే చెప్పారట. అలా పెళ్లైన కొత్తలో ఓ అపార్ట్​మెంట్​లో ఉన్నారట మహేశ్​ దంపతులు. ఓ ప్రముఖ యూట్యూబ్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆసక్తికర విషయాలను రివీల్​ చేశారు.

మహేశ్​ పెళ్లికి 'నాన్న షరతు'
అయితే వీరి పెళ్లి అందరి ప్రేమ వివాహాల్లాగా అంత ఈజీగా జరగలేదు. ఇందుకు మహేశ్​ బాబు తండ్రి సూపర్​స్టార్​ కృష్ణ ఓ షరతు విధించారట. ముందుగా వీరి ప్రేమ గురించి తెలుసుకున్న ఆయన, మహేశ్​-నమ్రతల పెళ్లికి నో చెప్పారట. అయితే అప్పుడే సీన్​లోకి ఎంట్రీ ఇచ్చారు మహేశ్​ సోదరి ఘట్టమనేని మంజుల. తమ్ముడి పెళ్లికి ఒప్పుకోవాలని తండ్రి కృష్ణను ఎలాగోలా ఒప్పించారట. కానీ, ఇందుకు కృష్ణ ఒక కండీషన్​ పెట్టారట. పెళ్లికి ముందు ఇద్దరూ స్టార్​ స్టేటస్​ను సంపాదించాలని కోరారట. ఆ తర్వాత ఏమైందో కానీ, తాను పెట్టిన షరతు​ను వెనక్కి తీసుకొని హ్యాపీగా ఇద్దరికి పెళ్లి జరిపించి ఆశీర్వదించారు కృష్ణ. ఇక ఈ జంట ప్రేమ పెళ్లికి గుర్తుగా కుమారుడు గౌతమ్​, కుమార్తె సితార జన్మించారు.

'నా దృష్టిలో పెళ్లంటే' - క్లారిటీ ఇచ్చిన ఊర్వశీ

హాలీవుడ్​ రేంజ్​లో 'కల్కి BGM'- ఇప్పుడిదే ట్రెండింగ్​- మీరు విన్నారా?

ABOUT THE AUTHOR

...view details