వేటకు చిరుత రెస్ట్​.. అడుగు దూరంలోనే జింకలు ఉన్నా..

By

Published : Jul 23, 2022, 8:05 PM IST

thumbnail

ఉత్తరాఖండ్​లోని జిమ్​ కార్బెట్​ నేషనల్​ పార్క్​లో ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ చిరుత, రెండు జింకలు పక్కపక్కనే నిల్చోని నీరు తాగాయి. అప్పటికే చిరుత, ఓ జింక కొలను వద్దకు చేరుకుని నీరు తాగుతుండగా మరో జింక అక్కడకు వచ్చింది. కళ్ల ముందే వేటాడేందుకు ఆహారం ఉన్నా.. జింకలపై చిరుత ఎలాంటి దాడి చేయలేదు. అయితే దీనిపై స్పందించిన అక్కడి అధికారులు.. ఇటువంటి ఘటనలు జరగడం కొత్తేం కాదు అన్నారు. చిరుత ఆకలితో లేనప్పుడు వేటాడదని.. కేవలం ఆహారం అవసరమైనప్పుడు మాత్రమే దాడి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.