Live Video On Dog Attacked on Boy : హైదరాబాద్​లో బాలుడిపై వీధికుక్క దాడి.. సీసీ కెమెరాలో దృశ్యాలు

By

Published : Jun 4, 2023, 4:06 PM IST

Updated : Jun 4, 2023, 4:56 PM IST

thumbnail

Dog Attacked a boy At Suraram in Hyderabad : హైదరాబాద్​లో వీధి కుక్కల దాడిలో మరో బాలుడు గాయపడ్డాడు. కుత్బుల్లాపూర్ పరిధిలో సూరారంలోని శ్రీరామ్​నగర్ కాలనీలో వీధిలో ఆడుకుంటున్న ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాలుడు కూడా ధైర్యం చేసి ప్రతిఘటించడంతో కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. తీవ్ర రక్త స్రావంతో బాధపడిన ఆ బాలుడు ఇంటి దగ్గర తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో వారు వెంటనే నల్లకుంటలోని ఓ ఆసుపత్రిలో బాలుడికి చికిత్స అందించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా.. ఇవాళ ఉదయం 10:30 సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన బాలుడి పేరు సాయి చరిత్(12)గా కాలనీ వాసులు చెబుతున్నారు. ఘటనపై కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడే ఇలాంటి ఘటనలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయని వాపోతున్నారు. అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతోనైన అధికారులు మేల్కొని కుక్కల బారి నుంచి తమ పిల్లలను కాపాడాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. 

Last Updated : Jun 4, 2023, 4:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.