Attack On Lovers At Gadwala : ప్రేమ వివాహం.. పోలీస్​స్టేషన్​లోనే లవర్స్​పై దాడి.. రోడ్డుపై పరుగులు తీసిన జంట

By

Published : Jul 11, 2023, 10:06 PM IST

thumbnail

Relatives attack on love couple in Gadwala Rural Police : వారిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. మేజర్లు కావడంతో పెళ్లి కూడా చేసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉండటంతో స్థానిక పోలీస్​స్టేషన్​ను ఆశ్రయించారు. ఈ క్రమంలో స్టేషన్​ వద్ద ఉన్న ప్రేమ జంటపై తల్లిదండ్రులు, వారి బంధువులు దాడి చేశారు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రేమ జంట రోడ్డుపై పరుగులు తీసిన ఘటన జోగులాంబ గద్వాల్​ జిల్లాలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల్​ జిల్లా గద్వాల్​ మండలం పూడూరు గ్రామానికి చెందిన శిరీష(22), గద్వాల్​ పట్టణానికి చెందిన చెందిన ప్రశాంత్ (25) ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఏపీలోని కర్నూల్ జిల్లా ఓర్వకల్లులో పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని గద్వాల రూరల్ పోలీస్​స్టేషన్​ను ఆశ్రయించారు. ఈ క్రమంలో స్టేషన్​వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు ప్రేమజంటతో గొడవకు దిగి స్టేషన్​లోనే ఇరువురిపై దాడి చేశారు. దీంతో వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రోడ్డుపై పరుగులు తీస్తూ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.