తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు : ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2023, 5:30 PM IST

thumbnail

Nirmala Seetharaman Fires On KCR : ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని ఆమె పేర్కొన్నారు. నేరేడ్​మెట్​లోని వాయుపురి రిక్రియేషన్​లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. మల్కాజ్​గిరి బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  

BJP Election Campaign In Telangana 2023 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధుల గురించి వివరించారు. రాష్ట్రంలో కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తెలంగాణలో నిత్యవసరాల ధరలు పెరిగాయని వెల్లడించారు. పెట్రోల్​, డీజిల్​పై కేంద్రం ధరలు తగ్గించిన.. కేసీఆర్​ ప్రభుత్వం వాటిపై పన్ను తగ్గించడం లేదని విమర్శించారు. భవిష్యత్​లో చేపట్టబోయే కార్యక్రమాలను అక్కడి స్థానికులకు వివరించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేస్తుందని నిర్మలా సీతారామన్​ ధీమా వ్యక్తంచేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.