కశ్మీరీ గేటు చుట్టూ ప్రవహిస్తున్న వరద!.. డ్రోన్​ విజువల్స్​ చూసేయండి..

By

Published : Jul 14, 2023, 9:44 PM IST

thumbnail

Kashmere Gate Flood Today : దేశ రాజధాని దిల్లీలో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. కొన్ని ప్రాంతాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. కశ్మీరీ గేటు ప్రాంతంలో వరద నీరు ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. ఆ ప్రాంతమంతా నదిని తలపిస్తోంది. మరోవైపు.. యమునా నది నీటి మట్టం శుక్రవారం తగ్గింది. దీంతో ఆ నది పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ముకుంద్‌పుర్ చౌక్ ప్రాంతంలో వరద నీటిలో స్నానం చేస్తూ ముగ్గురు బాలురు కాలువలో మునిగి మరణించారని అధికారులు తెలిపారు. వారంతా జహంగీర్‌పురి నివాసితులని చెప్పారు.

Uttar Pradesh Noida Floods : ఉత్తర్​ప్రదేశ్​లోని నోయిడాలో వ్యవసాయ పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. పంట పొలాల్లో నడుము లోతు వరద నీరు వచ్చింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.  

Bihar Floods : మరోవైపు.. పట్నాలో ఉన్న బిహార్ అసెంబ్లీ అవరణలోకి భారీగా వరద నీరు చేరింది. వెంటనే అప్రమత్తమైన సచివాలయం సిబ్బంది.. నీటిని పైపుల ద్వారా తోడి ట్యాంకర్లతో బయటకు పంపించారు. అసెంబ్లీ ఆవరణలోకి వరద నీరు రావడంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.