Car Hits Young Man Viral Video : రోడ్డు మధ్యలో విన్యాసాలు.. కారు ఢీకొని యువకుడు మృతి

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 5:04 PM IST

thumbnail

Car Hits Young Man Viral Video : రోడ్డు మధ్యలో విన్యాసాలు చేసిన యువకుడిని కారు బలంగా ఢీకొన్న ఘటన ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్​ జిల్లాలోని రిషికేశ్​లో జరిగింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ యువకుడు ఆస్పత్రిలో మృతి చెందాడు. బాధితుడిని శివమ్​గా రిషికేశ్​ పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబరు 11వ తేదీన రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు శివమ్​.. కాలినడకన ఇంటికి వెళ్తూ రోడ్డు మధ్యలో చిన్నపాటి విన్యాసాలు చేశాడు. ఎదురుగా వస్తున్న వాహనాలకు అడ్డంగా నిల్చున్నాడు. అదే సమయంలో హరిద్వార్ నుంచి వస్తున్న ఓ కారు అతడిని ఢీకొట్టింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శివమ్​ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి రిషికేశ్​ ఎయిమ్స్​ ఆస్పత్రికి రిఫర్​ చేశారు. దీంతో స్థానికులు అతడిని ఎయిమ్స్​కు తీసుకెళ్లారు. చికిత్స ప్రారంభించిన కాసేపటికే.. అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 

ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకున్నారు. శివమ్​ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. బాధితుడి తల్లి సునీతా దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డవ్వగా.. ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.