Viral: గర్భంతో ఉన్న ఆవుపైకి ట్రాక్టర్ ఎక్కించిన కిరాతకుడు

By

Published : Jun 7, 2021, 1:45 PM IST

thumbnail

ఛత్తీస్​గఢ్​లోని బిలాస్​పుర్​లో అమానవీయ ఘటన జరిగింది. రోడ్డుపై నిద్రిస్తున్న ఆవును ట్రాక్టర్​తో ఉద్దేశపూర్వకంగా తొక్కించాడు ఓ డ్రైవర్​. దీంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడ్ని ఈశ్వర్ ధ్రువ్​గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఆ ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నిందితునిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.