బావిలో పడ్డ గజరాజు.. అధికారుల రెస్క్యూ ఆపరేషన్​తో లక్కీగా

By

Published : Jan 12, 2023, 9:34 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

ఛత్తీస్‌గఢ్‌లోని అనేక జిల్లాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ​​జశ్​పుర్ జిల్లా కఛార్ గ్రామంలోకి మంగళవారం రాత్రి 12 ఏనుగులు ప్రవేశించాయి. దీంతో తమను తాము రక్షించుకునేందుకు స్థానికులు గజరాజులను తరిమికొట్టారు. ఆ సమయంలో ఓ ఏనుగు బావిలో పడిపోయింది. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో ఏనుగును బయటకు తీశారు. అయితే బయటకు రాగానే ఆ గజరాజు స్థానికుడిని తొండంతో తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.