ETV Bharat / sukhibhava

చంకల నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోందా ? అయితే ఈ టిప్స్ పాటించండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 3:40 PM IST

How To Solve Armpit Smell : చాలా మంది స్నానం చేసిన తర్వాత కూడా చంకల్లో చెమట, దుర్వాసన సమస్య ఎదుర్కోంటారు. దీనివల్ల మానసికంగా కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి చిట్కాలను పాటించాలి? నిపుణుల సలహాలు ఏంటి ? అనే వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

How To Solve Armpit Smell
How To Solve Armpit Smell

How To Solve Armpit Smell : చాలా మంది చెమట దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మహిళలు టైట్‌గా ఉండే జాకెట్లను ధరించడం వల్ల చంకల్లో దుర్వాసన సమస్య వెంటాడుతుంటుంది. దీనివల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఫీలవుతారు. సాధారణంగా వాతావరణంలో మార్పుల వల్ల చెమట వస్తుంటుంది. కానీ.. విపరీతమైన చెమట పడుతుంటే మాత్రం అదొక సమస్యగా గుర్తించాలి. ఆ సమస్యను 'హైపర్‌ హైడ్రోసిస్‌' అంటారు.

ఇది చాలామందిలో కనిపిస్తుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు, ఔషధాల ప్రభావం.. వంటివి దీనికి కారణాలు. ఈ ప్రాబ్లమ్​తో చాలా మంది ఆత్మ విశ్వాసం కోల్పోతుంటారు. నిజానికి చెమట పట్టడం శరీరానికి ఒకింత మంచిదే. అయితే.. అది శారీరక శ్రమతో రావాల్సి ఉంటుంది. ఇలా వచ్చే చెమటకు దుర్వాసన పెద్దగా ఉండదు. కానీ.. 'హైపర్‌ హైడ్రోసిస్‌' కారణంగా వచ్చే చెమట మాత్రం దుర్వాసన వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. అవి మీ కోసం..

క్యాన్సర్​ను తరిమికొట్టే - అద్భుతమైన ఫుడ్! - మీ డైట్​లో భాగం చేసుకోవాల్సిందే!

చంకల్లో దుర్వాసన రాకుండా ఉండటానికి చిట్కాలు :

  • ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి ఎంత సమయమైనా సరే.. రోజూ సాయంత్రం తప్పకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. తిరిగి ఉదయాన్నే స్నానం చేయాలి. ఇలా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల బ్యాక్టీరియా దరిచేరదు.
  • ఏదైనా పనిమీద బయటకు వెళ్లి వచ్చినా.. వ్యాయామం చేసినా.. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనివల్ల శరీరంపై ఉన్న మురికి తొలగిపోవడమే కాదు.. మనసు కూడా తేలికవుతుంది.
  • చంకల్లో తీవ్రమైన చెమట, దుర్వాసన వస్తున్న వారు రెడ్ మీట్ (పంది, గొర్రె, గొడ్డు మాంసం) తినకూడదు. వీటివల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
  • రెడ్‌ మీట్‌కు బదులు చేపలు గానీ, చికెన్ గాని తినడం మంచిది.
  • చెమట వల్ల శరీరంలోని లవణాలు బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి, రోజు ఎనిమిది గ్లాసుల నీటిని తప్పక తాగాలి.
  • వెల్లుల్లి, ఉల్లిపాయలు, మసాలా దినుసులు వంటివి శరీర దుర్వాసనను పెంచే ఆహార పదార్థాలు. కాబట్టి వీటిని తీసుకోవడం తగ్గించండి.
  • చంకల దగ్గర శుభ్రమైన టవల్‌తో పొడిగా ఉండేలా తుడవండి.
  • టీట్రీ ఆయిల్, బేకింగ్ సోడా, నిమ్మకాయ రసం వంటి పదార్థాలతో తయారు చేసిన సహజ డీయోడరెంట్‌లను ఉపయోగించండి.
  • చంకల్లో పెరిగే వెంట్రుకల వల్ల బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. కాబట్టి వాటిని షేవ్ చేయండి.
  • వీలైనంత వరకు కాటన్ దుస్తువులను ధరించండి. ఇవి చెమటను పీల్చుకుని దుర్వాసన సమస్య, చిరాకు రాకుండా చూస్తాయి.
  • క్యాలీ ఫ్లవర్‌, క్యాబేజీని తినడం తగ్గించండి. అలా అని పూర్తిగా మానేయడం వల్ల పోషక విలువల్ని కోల్పోతాం.
  • మద్యం సేవించకండి.

Note : పైన తెలిపిన సమాచారం నిపుణుల సలహాలు, సూచనలు. ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఈ చిట్కాలను పాటించినప్పటికీ తీవ్రమైన చెమట, దుర్వాసన సమస్య ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

కళ్లు పొడిబారుతున్నాయా? ఇలా చేస్తే హాయిగా ఉంటుంది!

ఉదయాన్నే టమాటా జ్యూస్ తాగితే - ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.