ETV Bharat / sukhibhava

వ్యాయామం చేస్తున్నారా?.. ఇవి తినడం మరవకండి!

author img

By

Published : Aug 3, 2021, 9:37 AM IST

Updated : Aug 3, 2021, 10:01 AM IST

కొత్తగా వ్యాయామం చేస్తున్నప్పుడు.. వర్కవుట్​ ముందు ఆ తర్వాత ఏం తినాలో తెలియట్లేదా?. కసరత్తుల తర్వాత డీలా పడినట్లు అనిపిస్తుందా?.. అయితే.. ఇది చదవండి.

food to take after excercise
వ్యాయామానికి ముందు తీసుకోవాల్సిన ఆహారం

కొత్తగా వ్యాయామం చేస్తున్నారా?. అయితే ఎక్సర్‌సైజ్‌ చేసే ముందు, ఆ తర్వాత ఏం తినాలో అవగాహన లేక ఇబ్బందులు పడుతుండే ఉంటారు. వర్కవుట్‌ చేసిన తర్వాత శక్తిలేనట్లు అనిపిస్తుంది. అయితే వ్యాయామానికి ముందు, తర్వాత ఏం తీసుకోవాలో తెలుసుకుంటే తగిన ఫలితాలు దక్కుతాయంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. ఈ సమస్య పరిష్కారానికి కొన్ని సూచనలూ అందిస్తున్నారు.

ముందుగా..

వర్కవుట్‌ చేసే ముందు ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ఇది చాలా ముఖ్యమైంది. ఏమీ తినకుండా చేయడం మంచిది కాదు. అవసరమైన శక్తిని తయారు చేసుకోవడానికి శరీరానికి అరగంట ముందు తగిన ఆహారాన్ని అందించాల్సిందే. అరటి పండు లేదా యాపిల్‌ను తీసుకోవచ్చు. లేదంటే ద్రాక్ష, స్ట్రాబెర్రీ ముక్కలను నాలుగైదు కలిపిన కప్పు ఓట్స్‌ను తింటే మంచిది. అలాగే కప్పు పోహాను తీసుకోవచ్చు. పీనట్‌బటర్‌ రాసిన బ్రెడ్‌ ముక్కను తిని వర్కవుట్‌కు వెళ్లొచ్చు. తేలికగా జీర్ణమై, శరీరానికి శక్తిని అందించేలా ఆహారం ఉంటే చాలు. అలాకాకుండా కొవ్వు ఎక్కువగా ఉండేవి, వేపుళ్లు చేసిన ఆహారాన్ని మాత్రం తీసుకుంటే వ్యాయామం కష్టమవుతుంది.

తర్వాత..

వర్కవుట్‌ చేసిన తర్వాత శరీరంలో శక్తిస్థాయులు తగ్గుతాయి. వీటిని పునరుద్ధరించే దిశగా ఆరోగ్యకరమైన కొవ్వు, కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. శరీరానికి తగినంత నీటిని అందించడం మర్చిపోకూడదు. లేదంటే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అరటిపండు, నట్స్‌ కలిపిన స్మూతీ లేదా, నట్స్‌, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశనగ, అవిసెగింజలు వంటివి తీసుకుంటే మంచిది. అలాగే ఉడికించిన గుడ్డు ప్రొటీన్‌ను అందిస్తుంది. చెెర్రీపండ్లను పెరుగులో కలిపి తినాలి. లంచ్‌లో తాజా కూరగాయలు, ఆకుకూరలుండేలా జాగ్రత్తపడాలి. వీటన్నింటినీ పాటిస్తే వ్యాయామం ఆరోగ్యంతోపాటు చక్కని శరీరసౌష్టవాన్ని అందిస్తుంది.

ఇదీ చదవండి: ఏరోబిక్‌ వ్యాయామాల కంటే.. ఈతతోనే మెదడుకు పదును!

Last Updated : Aug 3, 2021, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.