ETV Bharat / sukhibhava

చలికాలంలో కూడా వేడి చేస్తోందా? కారణాలు ఇవేనట!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 12:46 PM IST

Body Temperature High in Winter Season: చుట్టూ ఉన్నవారంతా చలికి వణికిపోతుంటారు. కానీ.. కొందరు మాత్రం ఒంట్లో వేడితో అవస్థలు పడుతుంటారు! మూత్రంలో మంట వంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. మరి.. ఈ పరిస్థితి కారణాలేంటో మీకు తెలుసా..?

Body Temperature High in Winter Season
Body Temperature High in Winter Season

Body Heat in Winter Season Full Details in Telugu: గొంతు తడి ఆరిపోతూ ఉంటుంది! ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. పెదవులు ఎండిపోయి నిర్జీవంగా తయారవుతాయి. ఊపిరి వదులుతుంటే వేడిగా సెగలు వస్తాయి. మొత్తంగా.. వాడిపోయిన పువ్వులా తయారవుతారు. ఇదంతా.. ఎండా కాలంలో కనిపించే పరిస్థితి. కానీ.. చలికాలంలో కూడా కొందరు ఈ "వేడి" లక్షణాలతో ఇబ్బంది పడుతుంటారు. డీహైడ్రేషన్‌కు గురికాకపోయినా.. ఇలాంటి అవస్థలు పడుతుంటారు. సీజన్‌కు తగ్గట్లు శరీర వ్యవస్థల పనితీరు మారకపోవడమే ఈ పరిస్థితికి కారణమని.. దీనికి పలు అనారోగ్యాలు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి మీ శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాలు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కళ్ల కింద డార్క్ సర్కిల్స్​ - ఈ ఫుడ్​తో ఈజీగా చెక్ పెట్టండి!

డయాబెటిస్: షుగర్ పేషెంట్ల శరీర ఉష్ణోగ్రత, మధుమేహం లేనివారి కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. డయాబెటిస్ ఉన్నవారి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండవు. ఇది చాలా కాలం పాటు కొనసాగితే.. శరీరంలోని నరాలు, రక్త నాళాలపై ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితి చెమట గ్రంథులను కూడా దెబ్బతీస్తుంది. దీంతో.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉండదు. దీనివల్ల బాడీ హీట్‌గా, సాధారణం కంటే వేడిగా అనిపించవచ్చు. అందుకే.. షుగర్ పేషెంట్లు ఎప్పుడూ మెడిసిన్ వాడుతూ ఉండాలి. షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటూ డయాబెటిస్‌ను సరిగా మేనేజ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు.

థైరాయిడ్ గ్రంథి పనితీరు: థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు.. హైపోథైరాయిడిజం రావచ్చు. ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే.. హైపర్ థైరాయిడిజం బారిన పడతారు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ హార్మోన్లను ఈ గ్రంథి రిలీజ్ చేసినప్పుడు సీరస్ ఇంబ్యాలెన్స్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. హార్మోన్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వేడి చేసినట్లు అనిపించవచ్చు. ఈ సందర్భంలో శరీరం వేడిని బ్యాలెన్స్ చేసుకోలేదు, తట్టుకోలేదు.

పాదాలు పగులుతున్నాయా? - ఈ టిప్స్​తో గులాబీ రేకుల్లా మారిపోతాయి!

మెనోపాజ్: మహిళలకు పీరియడ్స్ శాశ్వతంగా ఆగిపోయే దశను మెనోపాజ్ అంటారు. మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈస్ట్రోజెన్ తక్కువగా ఉన్నప్పుడు హాట్ ఫ్లాషెస్ వంటి లక్షణాలను కలిగిస్తుంది. దీంతో కొన్నిసార్లు సడన్‌గా ముఖం, ఛాతీ, మెడ వంటి శరీర భాగాలు వేడిగా మారవచ్చు.

గర్భం: ప్రెగ్నెన్సీ అనేది అనారోగ్యం కిందకు రాదు. కానీ.. గర్భిణుల శరీరంలో జరిగే మార్పుల కారణంగా, వారి శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు గురవుతుంది. కొన్నిసార్లు బాడీ హీట్ అవుతూ ఉండవచ్చు.

ఇలా చేయండి : ఈ సమస్యలతో బాధపడేవారు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ బాధితులు.. షుగర్ కంట్రోల్​లో ఉండేలా చూసుకోవాలి. ఇందుకు తగిన ఆహారం తీసుకోవాలి. థైరాయిడ్ సమస్యను ఎదుర్కొనే వారు.. వైద్యుల సూచనలు పాటించాలి. వీటితోపాటు హైడ్రేట్​గా ఉండాలి. చలికాలం పెద్దగా దాహం అనిపించదు. దీంతో.. చాలా మంది నీళ్లు తాగడం మానేస్తారు. దీనివల్ల తెలియకుండానే శరీరం జీవం కోల్పోతుంది. అందువల్ల.. తగినంత నీరు తాగడం కంపల్సరీ.

పీరియడ్స్ టైమ్​లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? - ఈ విషయాలు తెలియకపోతే ఇబ్బందే!

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?-అయితే మీకు IQ ఎక్కువ ఉన్నట్లే!

షుగర్​ పేషెంట్స్​ సీతాఫలం తినొచ్చా?-నిపుణుల మాటేంటి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.