ETV Bharat / sukhibhava

భోజనం తర్వాత సెక్స్ చేస్తే గుండె పోటు వస్తుందా? బీపీ పెరిగితే ఎలా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 10:59 AM IST

After Eating Sex is Good or Bad : చాలా మందికి సెక్స్ విషయంలో చాలా అపోహలుంటాయి. అందులో భోజనం చేసిన తర్వాత సెక్స్ చేయొచ్చా లేదా చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయా అనేది కూడా ఒకటి. ఇందులో నిజానిజాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

After Eating Sex is Good or Bad
After Eating Sex is Good or Bad

After Eating Sex is Good or Bad : మన దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్​పై సరైన అవగాహన లేదు. చాలా మందికి శృంగారం విషయంలో అనేక రకాల సందేహాలుంటాయి. వాటిల్లో ఏ సమయంలో సెక్స్ చేయాలి, భోజనం తర్వాత చేయొచ్చా? తిన్న తర్వాత చేస్తే ఏవైనా సమస్యలు తలెత్తుతాయా అనేవి కూడా ఉంటాయి. వాటికి జవాబు ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

భోజనం చేయగానే రతిలో పాల్గొంటే గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువ. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది. భోజనం తక్కువ తింటే ఏం కాదు. కానీ కడుపు నిండా భోజనం చేస్తే ఆయాసం వస్తుంది. దీన్నే భుక్తాయాసం అంటారు. సెక్స్​లో పాల్గొన్నప్పుడు సాధారణంగా కొంచెం బీపీ (సిస్టాలిక్ రీడింగ్) పెరుగుతుంది. సాధారణంగా 40 పెరుగుతుంది. ఉదాహరణకు 120 ఉండే వాళ్లకు ఆ సమయంలో 160 దాకా వెళుతుంది.

"భోజనం తర్వాత సెక్స్ చేస్తే గుండెపోటు వచ్చే అవకాశం చాలా తక్కువ. అయితే, గుండె జబ్బులు ఉన్నవాళ్లు భోజనం చేసిన వెంటనే సెక్స్​లో పాల్గొంటే కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పెరిగే బీపీ గుండెపై ప్రభావం చూపించి హార్ట్ అటాక్ వచ్చే అవకాశముంది. కాబట్టి హృదయ సంబంధ వ్యాధులున్న వాళ్లు భోజనం తర్వాత కనీసం గంట సేపు ఆగి తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చు."
--డా. సమరం, ప్రముఖ సెక్సాలజిస్టు

"ఆరోగ్యంగా ఉన్నవారు సైతం తక్కువ భోజనం చేసిన సమయంలో మాత్రమే సెక్స్​లో పాల్గొనాలి. ఫుల్ మీల్స్ తీసుకుంటే మాత్రం అరగంట నుంచి గంట సేపు వేచి చూడడం మంచిది. ఎందుకంటే బీపీ పెరిగితే అది గుండెపై ప్రభావం చూపించి లేనిపోని సమస్యలు వస్తాయి" అని డాక్టర్ సమరం తెలిపారు.

గర్భ నిరోధానికి కుటుంబ నియంత్రణ ఒక్కటే మార్గమా?
గర్భనిరోధానికి రెండు రకాల ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. మగవాళ్లకు అయితే వాసెక్టమీ, మహిళలకు అయితే ట్యుబెక్టమీ చేస్తారు. అయితే, ఈ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల తర్వాతి కాలంలో ఇబ్బందులు వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో నిజం లేదని, ఇది చేయించుకోవడానికి ఎలాంటి భయం అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

"ముఖ్యంగా పురుషుల్లో ఒక రకమైన భయం ఉంటుంది. వాసెక్టమీ ఆపరేషన్ అనేది పది నిమిషాల్లో పూర్తవుతుంది. తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్లిపోవచ్చు. రోజూ వారీ పనులన్నీ చేసుకోవచ్చు. కార్ డ్రైవింగ్, ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ఆపరేషన్ తర్వాత నరాల బలహీనత వస్తుందని, సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుందని భయపడతారు. కానీ అలాంటివేమీ జరగవు. మహిళలతో పోలిస్తే పురుషుల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సులభంగానే ఉంటుంది" అని డాక్టర్ సమరం చెప్పారు.

భోజనం తర్వాత సెక్స్ చేస్తే గుండె పోటు వస్తుందా?

How To Increase Sexual Feelings : సెక్స్ లైఫ్​ డల్​గా ఉందా?.. ఈ చిట్కాల‌తో మీ లైంగిక ఆసక్తి డబుల్​!

Why Do We Feel Relax After Sex : సెక్స్ చేసిన తరువాత బాడీకి ఫుల్ రిలీఫ్​.. ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.