ETV Bharat / state

ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గురువారం నల్గొండలో ధర్నా: ఉత్తమ్

author img

By

Published : Nov 4, 2020, 6:12 PM IST

Updated : Nov 4, 2020, 10:48 PM IST

సన్నరకం ధాన్యాన్ని రెండున్నర వేల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం నల్గొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు.

uttam-kumar-reddy-declares-the-protest-against-of-government-in-nalgonda-on-tomorrow
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గురువారం నల్గొండలో ధర్నా: ఉత్తమ్

నియంత్రిత సాగు విధానం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సన్నరకం ధాన్యాన్ని సాగుచేయాలన్న సీఎం... నేడు వాటికి మద్దతు ధర కల్పించటంలో ఎందుకు జాప్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతోపాటు సన్న రకాలకు రెండున్నర వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్​లో కాంగ్రెస్ బృందంతో కలిసి ఆయన పర్యటించారు.

ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గురువారం నల్గొండలో ధర్నా: ఉత్తమ్

గురువారం ధర్నా

రైతుల పట్ల తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాల్ని అవలంభిస్తున్నాయంటూ... చేపట్టిన సంతకాల సేకరణ వేగవంతంగా సాగుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల నుంచి సేకరించిన సంతకాలను... నవంబరు 14న రాష్ట్రపతికి అందజేస్తామన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఉత్తమ్ సమావేశం నిర్వహించారు. రైతు వ్యతిరేక విధానాలపై గురువారం నల్గొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

గవర్నర్​కు వినతిపత్రం

రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాల తీరుపై మండిపడుతూ... తేమ శాతంతో నిమిత్తం లేకుండా పత్తి కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో పంటలు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించాలన్నారు. పంటల బీమా వర్తింపుతోపాటు లక్ష రూపాయల మేరకు రుణమాఫీ చేయాలంటూ... గవర్నర్​కు వినతిపత్రం అందజేస్తామన్నారు. సంతకాల సేకరణలో భాగంగా... ప్రతి మండలంలో రెండు వేల మంది రైతులను కలవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: రేపు నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన: ఉత్తమ్​

Last Updated : Nov 4, 2020, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.