ETV Bharat / state

యాజమాన్యం క్షమాపణతో శాంతించిన అయ్యప్ప స్వాములు

author img

By

Published : Dec 3, 2019, 7:23 PM IST

అయ్యప్ప మాల వేసుకున్నాడని ఓ విద్యార్థిని లోపలికి రానివ్వకపోవడం వల్ల అయ్యప్ప స్వాములంతా పాఠశాల ఎదుట ధర్నాకి దిగారు. చివరకి యాజమాన్యం క్షమాపణ చెప్పడంతో స్వాములు శాంతించి ఆందోళనను విరమించారు.

ayyappa
యాజమాన్యం క్షమాపణతో శాంతించిన అయ్యప్ప స్వాములు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఇండియా మిషన్ హై స్కూల్​లో ఓ విద్యార్థి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నందుకు స్కూల్ లోకి అనుమతించలేదు. విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వాములు ఇండియా మిషన్ స్కూల్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. ప్రధానోపాధ్యాయుడు ఇప్పుడే భోజనం చేసి వస్తానని చెప్పి బయటికి వెళ్లి ఎంతసేపటికీ రాకపోవడం వల్ల అయ్యప్ప స్వాములు మధ్యాహ్నం నుంచి స్కూల్ బయటే ఆందోళన కొనసాగించారు.

సాయంత్రం 5 గంటలకు స్కూల్ యాజమాన్యం అయ్యప్ప స్వాములకు, విద్యార్థి తండ్రికి క్షమాపణ చెప్పటంతో స్వాములు ఆందోళన విరమించారు. మరోవైపు అదే సమయంలో పాఠశాల ఫీజు చెల్లించలేదని ఓ విద్యార్థితో యాజమాన్యం అసభ్యంగా మాట్లాడారంటూ విద్యార్థి తల్లి ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజు చెల్లించకుంటే అసభ్యంగా మాట్లాడుతారా? అంటూ ప్రిన్సిపాల్​ను ప్రశ్నించింది. పోలీసులు విద్యార్థిని తల్లిని, వారి బంధువులను సముదాయించి అక్కడి నుండి పంపించివేశారు.

యాజమాన్యం క్షమాపణతో శాంతించిన అయ్యప్ప స్వాములు

ఇవీ చూడండి: కీలక పదవికి జైలు నుంచే ఎన్నికైన లాలూ

TG_NLG_62_03_KSHAMAPANA_AV_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఇండియా మిషన్ హై స్కూల్ లో ఓ విద్యార్థి అయ్యప్పస్వామి మాల వేసుకున్నందుకు స్కూల్ లోకి అనుమతించలేదు.దీనితో అయ్యప్పస్వాములు ఇండియా మిషన్ స్కూల్ ముందు బైఠాయించి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఆందోళన చేశారు. సాయంత్రం 5 గంటలకు స్కూల్ యాజమాన్యం అయ్యప్పస్వాములకు, విద్యార్థి తండ్రికి క్షమాపణ చెప్పటం తో అయ్యప్పస్వాములు ఆందోళన విరమించారు. ప్రిన్సిపాల్ ఇప్పుడే భోజనం చేసి వస్తానని చెప్పి బయటికి వెళ్లి రాకపోవడంతో, అయ్యప్ప స్వాములు మధ్యాహ్నం నుండి స్కూల్ ముందు ఆందోళన నిర్వహించారు. మొత్తానికి పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పటం తో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అదే సమయంలో స్కూల్ ఫీజు చెల్లించలేదని పాఠశాల యాజమాన్యం అసభ్యంగా మాట్లాడారంటూ ఓ విద్యార్థిని తల్లి ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజు చెల్లించకుంటే అసభ్యంగా మాట్లాడుతారా ? అంటూ ప్రిన్సిపాల్ ను ప్రశ్నించింది. పోలీసులు విద్యార్థిని తల్లిని, వారి బంధువులను సముదాయించి అక్కడి నుండి పంపించివేశారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.