ETV Bharat / state

'పోలింగ్ బూత్​ల వద్ద అధికార పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడింది'

author img

By

Published : Nov 3, 2020, 6:33 PM IST

ప్రతిపక్షం బాగుంటేనే... ప్రజాస్వామ్యం బాగుంటుందనే నినాదం.. దుబ్బాక నియోజకవర్గంలో రుజువు అవుతోందని భాజపా అభ్యర్థి రఘునందన్​ రావు తెలిపారు. అధికార పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ ప్రజలు శాంతియుతంగా ఓట్లు వేశారన్నారు.

bjp candidate Raghu nadan rao allegations on trs leaders about by poll election in dubbaka
అధికార పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడింది: రఘనందన్ రావు

దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా తప్పక విజయం సాధిస్తుందని... ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్​ రావు ధీమా వ్యక్తం చేశారు. అక్కడక్కడ చిన్న ఘటనలు మినహా... పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.

తెరాస ఎంత అధికార దుర్వినియోగం చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ... ప్రజలు సంయమనంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు శాంతియుతంగా ఓట్లు వేశారని తెలిపారు. పలుచోట్ల కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి.. పలుమార్లు పోలింగ్ బూత్​ల్లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం బాగుంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుందనే నినాదం దుబ్బాకలో రుజువు అవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక.. 10న లెక్కింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.