ETV Bharat / state

JAGGAREDDY: 15 అంబులెన్స్​లతో ఉచిత సేవలందిస్తా: జగ్గారెడ్డి

author img

By

Published : May 28, 2021, 6:47 PM IST

సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం 15 అంబులెన్స్​లను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కరోనా బాధితులందరూ ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

MLA Jaggareddy says he will provide free services with 15 ambulances
15 అంబులెన్స్​లతో ఉచిత సేవలందిస్తా: జగ్గారెడ్డి

కరోనా విపత్కర సమయంలో... తన నియోజక వర్గంలో 15 అంబులెన్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే గాంధీభవన్‌లో రెండు, సంగారెడ్డి, ససదాశివపేటల్లో ఒక్కొక్కటి లెక్కన నాలుగు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో 13 అంబులెన్స్‌లను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. కొవిడ్‌ బాధితులకు సేవలు అందించాలన్న ఏఐసీసీ పిలుపుతో పాటు స్వర్గస్తులైన తన తల్లిదండ్రులు జయమ్మ, జగ్గారెడ్డిల జ్ఞాపకార్థం అంబులెన్స్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు తెలిపారు.

పేద ప్రజల కోసం ఉచితంగా ఈ సేవలందిస్తున్నట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. సదాశివపేట, సంగారెడ్డిల్లోని అంబులెన్స్‌ల కోసం తన క్యాంపు కార్యాలయం నెంబర్ 08455-278355లకు ఫోన్‌ చేయాలని సూచించారు. రాజకీయం కోసం వీటిని ఏర్పాటు చేయలేదని, పేద ప్రజల కోసమే ఈ ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వివరించారు.

ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.