ETV Bharat / state

యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తున్న సంగారెడ్డి ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 10:51 PM IST

Battle Tank in sangareddy ordnance Factory : యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తోంది సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ. భూమిపైన, నీటిలోనూ శత్రువులను ఎదుర్కోవడానికి ఇవీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ప్రతి ఏటా ఇక్కడి నుంచి ఆర్మీకి యుద్ధ ట్యాంకులు అందుతున్నాయి.

Indian Army Ordnance Factory in Sangareddy
Battle Tank in sangareddy ordnance Factory

Battle Tank in Sangareddy ordnance Factory : సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, యుద్ధ ట్యాంకుల తయారీలో సత్తా చాటుతోంది. ఇక్కడ తయారయ్యే ట్యాంకులు భూమిపైన, నీటిలో శత్రువులపై పోరాడటంలో ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది 100 నుంచి 120 యుద్ధ ట్యాంకులను(battle Tanks) ఆర్మీకి అందిస్తోంది. ఇప్పటి వరకు 40 ఏళ్లల్లో 2 వేల 500 యుద్ధ ట్యాంకులను అందించామని అధికారులు చెబుతున్నారు.

Battle Tank at Yeddumailaram in Telangana : ఈ రెండు యుద్ధ ట్యాంకులు భూమిపై, నీటిలో శత్రువులపై పోరాడగల పూర్తి సామర్ధ్యంతో రూపొందించారు. ఇవి భూమిపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో, నీటిలో 7 నుంచి 8 కిలో మీటర్ల వేగంగా ప్రయాణించేలా రూపొందించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 70 యుద్ధ వాహనాలను భారత రక్షణ (Defense of India)రంగానికి అందించినట్లు, ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగార జనరల్‌ మేనేజర్‌ రత్న ప్రసాద్‌ తెలిపారు.

ఫైటర్ పైలట్​లా మారిన మోదీ​- 'తేజస్' యుద్ధ విమానంలో రయ్​రయ్

2500 War Tanks in Sangareddy Ordnance Factory : 1986లో ప్రారంభమైన ఈ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ నేటికీ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఆర్మీ అవసరాల మేరకు తాము వాహనాలను తయారు చేస్తున్నట్టు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ సజిత్‌ రెడ్డి(Joint General Manager Sajith Reddy) వెల్లడించారు. ఈ రెండు వాహనాలు యుద్ధ క్షేత్రంలో ముందు భాగంలో ఉండి సైన్యానికి దిశానిర్దేశం చేసేందుకు వాడుతారని ఆయన పేర్కొన్నారు.

Indian Army Ordnance Factory in Sangareddy : షిప్‌లపై ఉపయోగించే విధంగా సొంతంగా డిజైన్‌ చేసిన తుపాకులను(Guns) ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారంలో తయారు చేస్తున్నారు. గతంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను తయారు చేసినా పని భారం వల్ల జబల్‌పూర్‌కి తరలించినట్లు అధికారులు తెలిపారు.

యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తున్న సంగారెడ్డి ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ

100 గంటల్లో కార్మికుల వద్దకు! రంగంలోకి ఆర్మీ- వర్టికల్​ డ్రిల్లింగ్​ ప్రారంభం

Yudh Abhyas Exercise Alaska 2023 : యుద్ధ అభ్యాస్.. భారత్- అమెరికా సైనిక దళాల పారా జంప్​.. వీడియో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.