ETV Bharat / state

తెలంగాణలో ఆక్సిజన్ అందక ఒక్కరు కూడా చనిపోలేదు: కేటీఆర్

author img

By

Published : Mar 5, 2022, 4:06 PM IST

KTR Siricilla Tour
KTR Siricilla Tour

KTR Vemulawada Tour: హెల్త్​ ప్రొఫైల్​లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో అద్భుతాలు చేసుకుంటున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్​ ప్రాజెక్టును మంత్రి ప్రారంభించారు.

KTR Vemulawada Tour: కరోనా విజృంభిస్తున్నా భయపడకుండా తమ కుటుంబాలను కూడా మరిచిపోయి వృత్తికి అంకితమయ్యారని వైద్య సిబ్బందిని మంత్రి కేటీఆర్ కొనియాడారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి హెల్త్​ ప్రొఫైల్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి హెల్త్​ చెకప్​ చేస్తారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్​ ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఇంటింటికి వెళ్లి అన్ని పరీక్షలు

హెల్త్​ ప్రొఫైల్​ కోసం ప్రత్యేకంగా ఒక కిట్​ను రూపొందించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి, దంత పరీక్ష కూడా చేస్తారని పేర్కొన్నారు. రాబోయే 60 రోజుల్లో ఇంటింటికి తిరిగి అన్ని పరీక్షలు చేస్తారని అన్నారు. హెల్త్​ రికార్డులు తయారు చేయడం వల్ల... అత్యవసరమైన పరిస్థితుల్లో వెంటనే వైద్యం అందించేందుకు వీలుంటుందని చెప్పారు.

ఒక్క ఐసీయూ కూడా లేకుండే...

హెల్త్​ ప్రొఫైల్ ఆధారంగా సహేతుకమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కావాలని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. హెల్త్​ ప్రొఫైల్ విషయంలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో అద్భుతాలు చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ వచ్చేంత వరకు ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఐసీయూ లేవని చెప్పారు. కానీ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా ఐసీయూలు ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు.

వైద్యం విషయంలో ఇప్పటికే ఎన్నో మైళ్లు

'విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉంది. రూ.7300 కోట్ల రూపాయలతో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ నెల 8న వనపర్తిలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. వైద్యం విషయంలో ఇప్పటికే ఎన్నో మైళ్లు రాళ్లను అదిగమించుకున్నాం. ఉత్తరప్రదేశ్​, కర్ణాటకలో ఆక్సిజన్​ అందక ఆస్పత్రిలో పిల్లలు చనిపోయారు. కానీ తెలంగాణలో ఆక్సిజన్ అందక ఒక్కరు కూడా చనిపోలేదు.' - కేటీఆర్

ఇదీ చదవండి : విమర్శలు చేయడం సులభం... పనులు చేయడమే కష్టం: కేటీఆర్‌

సైకిల్​పై నుంచి పడిపోయిన ఎమ్మెల్యే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.