ETV Bharat / state

Nizamabad Telangana Election Result 2023 LIVE : ఇందూరులో హోరాహోరీ పోరు - కాంగ్రెస్ 4, బీజేపీ 3 స్థానాల్లో గెలుపు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 2:00 PM IST

Updated : Dec 3, 2023, 9:48 PM IST

Nizamabad Telangana Election Result 2023 LIVE : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ హస్తగతమవగా, గత అసెంబ్లీ ఎన్నికల కంటే భిన్నంగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ రెండు స్థానాల్లోనే ఆధిక్యం ప్రదర్శించింది. గతంలో ఖాతా తెరవని బీజేపీ ఈసారి మూడు నియోజకవర్గాల్లో వికసించి సత్తా చాటుకుంది. ముఖ్యంగా కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి సరకొత్త రికార్డ్​ను కమలం తన ఖాతాలో వేసుకుంది.

Telangana assembly results Live 2023
Nizamabad Telangana Election Result 2023 LIVE

Nizamabad Telangana Election Result 2023 LIVE : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో 4 స్థానాలు కాంగ్రెస్ కైవసమయ్యాయి. బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో హస్తం పార్టీ విజయం సాధించింది. అధికార పార్టీ బీఆర్ఎస్(BRS Party) కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. వాటిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో జయకేతనం ఎగురవేసి గత ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. మరోవైపు బాల్కొండ నియోజకవర్గంలో వేముల ప్రశాంత్ రెడ్డి గెలుపొందారు. గతంలో ఖాతా తెరవని బీజేపీ ఈసారి మూడు నియోజకవర్గాల్లో వికసించి సత్తా చాటుకుంది. ముఖ్యంగా కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించి రికార్డు సృష్టించింది.

Congress Nizamabad Election Results 2023 : : ప్రభుత్వ వ్యతిరేకత, గత ఎన్నికల్లో ఓటమి చెందాడనే సానుభూతి ఒకింత ఫలించదనే చెప్పవచ్చు. పార్టీ మేనిఫెస్టోను(Manifesto) ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం సానుకూలమయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి నిజామాబాద్ గ్రామీణం నుంచి విజయం సాధించారు.

Revanth Reddy take oath as Chief Minister Tomorrow : రేపే సీఎంగా రేవంత్​ రెడ్డి ప్రమాణ స్వీకారం?

బోధన్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీగా ప్రచారం సాగగా బీజేపీ అభ్యర్థి సైతం గట్టి పోటీనిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్‌ మైనార్టీల మద్దతుతో తిరిగి విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నప్పటికీ, మైనార్టీలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి విజయం సాధించి జయకేతనం ఎగురవేశారు.

జుక్కల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మీకాంతరావు విజయం : రాష్ట్ర సరిహద్దు(Staste Boarder) నియోజకవర్గమైన జుక్కల్‌లో త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రచారాలతో హోరెత్తించిన కాంగ్రెస్‌ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావుకు గెలుపు వరించింది. ప్రధాన అభ్యర్థులైన బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షిండే, బీజేపీ అభ్యర్థి అరుణతార ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారాం అనూహ్యంగా బీఆర్ఎస్​కు మద్దతు పలికటంతో.. పార్టీ నుంచి సస్పెండైన ఆయన ప్రభావం ఎలా ఉంటుందోనని చర్చ సాగినప్పటికీ పెద్దగా నష్టం వాటిల్లలేదు.

Telangana Congress CM Swearing Ceremony : సాధారణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ - రేపు సీఎం ప్రమాణ స్వీకారం

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు విజయం : వైశాల్యం పరంగా ఉమ్మడి జిల్లాలోనే పెద్దదైన ఈ నియోజకవర్గంలో ద్విముఖ పోటీ నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అనే విధంగా పోరు సాగింది. చివరకు హస్తం పార్టీకే విజయం వరించింది. అభ్యర్థి మదన్‌మోహన్‌రావు విజయం పొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున జాజాల సురేందర్‌ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ఈదఫా బీఆర్ఎస్(BRS Party) తరఫున బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు.

Pocharam Wins Bansuwada Seat 2023 : : బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న ఆయన బాన్సువాడ నుంచి గెలుపొంది గత ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. గతంలో స్పీకర్‌గా పనిచేసిన వారు తదుపరి ఎన్నికల్లో గెలుపొందిన సందర్భాలు లేవు. తాజాగా పోచారం గెలుపొంది ఆ ఆనవాయితీకి స్వస్తి పలికారు.

కాంగ్రెస్​ పార్టీకి జోష్​ తీసుకొచ్చి - అన్నీ తానై వన్​ మ్యాన్​ ఆర్మీ షో

గతంలో స్పీకర్‌గా పనిచేసిన మధుసూదనాచారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాదెండ్ల మనోహర్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, సురేష్‌రెడ్డి, ప్రతిభా భారతి తదితరులు ఓటమి చవిచూశారు. దీంతో 2018లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవి చేపట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. కేసీఆర్‌ పోచారం శ్రీనివాసరెడ్డిని ఒప్పించి సభాపతిగా నియమించారు. ప్రస్తుతం పోచారం గెలుపుతో పాత ఆనవాయితీకి అడ్డుకట్ట వేసినట్లయింది.

Vemula Prashant Reddy Wins Balkonda Seat : : ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచే మంత్రి ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మరోమారు ప్రశాంత్ రెడ్డి మరోమారు విజయ బావుటా ఎగురవేశారు. ప్రధాన అభ్యర్థులుగా గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి బరిలో నిలిచి ద్వితీయస్థానం సాధించిన సునీల్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిగా బరిలో అన్నపూర్ణమ్మ నిలిచారు.

BJP Wins Kamareddy Seat : హోరా హోరీగా సాగిన తెలంగణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముఖ్యమంత్రి కేసీఆర్‌, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓటమిపాలు చేస్తూ బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయఢంకా మోగించారు. కామారెడ్డిలో 5,156 ఓట్ల తేడాతో వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. రెండో స్థానంలో కేసీఆర్‌, మూడో స్థానంలో రేవంత్​లు ఉన్నారు.

Bandi Sanjay Demanding Recounting In Karimnagar : కరీంనగర్​ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

నిజామాబాద్‌ అర్బన్‌లో బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ విజయం : ఈ నియోజకవర్గంలో ప్రధానంగా త్రిముఖ పోటీ కొనసాగింది. ఇక్కడ అభ్యర్థులు ఎత్తులకు పై ఎత్తులు వేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే నమ్మకంతో బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తా ప్రయత్నించినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి.

కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ(Former Minister Shabbir Ali) అనూహ్యంగా కామారెడ్డి నుంచి కాకుండా ఈ నియోజకవర్గం బరిలో నిలిచారు. టికెట్‌ కోసం దరఖాస్తు చేసిన వారందరి మద్దతు కూడగట్టి మరీ ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా మైనార్టీల మద్దతుతో విజయం సాధిస్తాననే విశ్వాసంతో ఉన్నప్పటికీ వాటిన్నింటినీ తలకిందులు చేస్తూ బీజేపీ అభ్కర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా విజయకేతనం ఎగురవేశారు.

ఆర్మూర్‌లో బీజేపీ అభ్యర్థి రాకేష్‌రెడ్డి విజయం : వ్యవసాయపరంగా ప్రఖ్యాతి గాంచిన ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. పసుపు రైతుల మద్దతు, యువత ఆశీస్సులతో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ప్రభుత్వం నుంచి అభివృద్ధి ఫలాలు పొందిన వారు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల మద్దతుతో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా సాధించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి వినయ్‌కుమార్‌రెడ్డి విస్తృత ప్రచారం చేపట్టిన పెద్దగా ఫలించలేదు.

KTR, Telangana Election Result 2023 : 'అధికారంలో ఉంటే ఎంత బాధ్యతగా ఉన్నామో - ఓడిపోయినా అంతే బాధ్యతగా ఉంటాం'

DK Sivakumar meet Revanth, Telangana assembly election Results 2023 : రేవంత్ రెడ్డితో డీకే శివకుమార్ సంబురాలు

Last Updated : Dec 3, 2023, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.