ETV Bharat / state

'ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు ముందుకు రావాలి'

author img

By

Published : Jan 28, 2021, 3:40 PM IST

లాక్​ డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయిన ప్రైవేట్​ టీచర్లకు ములుగు ఎమ్మెల్యే సీతక్క బియ్యం, ఇతర నిత్యవసరాలు అందించారు. ఇన్ని రోజులు పిల్లలకు పాఠాలు నేర్పి.. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన టీచర్లను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆమె కోరారు.

Mulugu MLA Seethakka provided  necessities to the private teachers who lost their jobs
ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు ముందుకు రావాలి

ప్రైవేట్​ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గోవిందరావుపేట మండలంలోని మెరిట్ ప్రైవేట్ టీచర్లకు బియ్యం, నిత్యావసర సరకులను సీతక్క పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది టీచర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.

సుమారు 100మంది ప్రైవేట్​ టీచర్లకు బియ్యం, ఇతర నిత్యావసర సరకులను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఎమ్మెస్ ఆప్టికల్స్ యాజమాన్యం, మండల కాంగ్రెస్ నాయకులు, పలువురు టీచర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆహారం తిరస్కరించిన దంపతులు.. చిత్రవిచిత్ర ప్రవర్తన..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.