ETV Bharat / state

నాలుగురోజుల్లో మినీ మేడారం జాతర... పనుల్లో నిమగ్నమైన అధికారులు

author img

By

Published : Feb 20, 2021, 1:28 PM IST

Updated : Feb 20, 2021, 2:23 PM IST

arrangements for mini medaram jatara in mulugu
నాలుగురోజుల్లో మినీ మేడారం జాతర... పనుల్లో నిమగ్నమైన అధికారులు

మినీ మేడారం జాతర సమీపిస్తున్న వేళ జిల్లా అధికారులు అప్రమత్తమై ముమ్మరంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. కలెక్టర్‌ కృష్ణాదిత్య ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. గుడి పరిసరాలు, చిలకలగుట్ట, జంపన్నవాగు, రెడ్డిగూడెం ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చురుగ్గా సాగుతున్నాయి.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతల మినీ జాతర నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. గుడి పరిసరాలు, చిలకలగుట్ట, జంపన్న వాగు, రెడ్డిగూడెంతో పాటు రహదారి వెంబడి పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. చెత్తను తొలగించేందుకు ఏపీ నుంచి అదనంగా 200 మందిని రప్పించినట్లు అధికారులు తెలిపారు.

అసౌకర్యాలు లేకుండా..

ఇప్పటికే భక్తులు ఆదివారం, బుధవారం, గురువారాల్లో వనదేవతల దర్శనం కోసం భారీగా తరలి వస్తున్నారని వెల్లడించారు. చిన్న జాతర సమయానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య తెలిపారు.

నాలుగురోజుల్లో మినీ మేడారం జాతర... పనుల్లో నిమగ్నమైన అధికారులు

నిరంతరం కరెంట్ ఉండేలా గుడి పరిసరాలలో తొమ్మిది ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 10 ట్రాన్స్​ఫార్మర్లను భక్తులు ఉండే పరిసరాల్లో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 16 స్థానాల్లో పంపుసెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జంపన్న వాగు బ్రిడ్జి వద్ద ఇరువైపుల డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

జంపన్నవాగులో చెక్ డ్యాములు ఉండడంతో ఎక్కువగా నీరు ప్రవహిస్తుందని తెలిపారు. వాగు లోతుగా ఉన్న ప్రాంతంలో ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నామని తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చూడండి: గోదావరి-కావేరి అనుసంధానం.. ఇచ్చంపల్లి నుంచే!

Last Updated :Feb 20, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.