ETV Bharat / state

SEETHAKKA: రాష్ట్ర సంపద ప్రజలకు పంచాలి: సీతక్క

author img

By

Published : Aug 25, 2021, 4:31 PM IST

ఇంద్రవల్లిలో దళిత ఆదివాసీ దండోర పేరిట కాంగ్రెస్​ కార్యక్రమం నిర్వహించిన తర్వాతనే.. సీఎంవోలో దళిత అధికారిని నియమించారని కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీల హక్కుల సాధన, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికే రేవంత్​రెడ్డి దీక్ష చేస్తున్నారని సీతక్క తెలిపారు. మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్​ ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.

mulugu mla seetakka
mulugu mla seetakka

ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న మూడుచింతలపల్లిలో కోట్ల రూపాయల ప్రకటనలు తప్ప.. ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఆ గ్రామంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భాగంగా రెండో రోజు రేవంత్​రెడ్డి చేస్తున్న దీక్షలో ఆమె పాల్గొన్నారు.

దళితులు, గిరిజనులు, ఆదివాసీల సమస్యలు బయటకు తీసుకువచ్చేందుకే ఈ దండోర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సీతక్క తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు చైతన్యం తీసుకొచ్చేందుకే దీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పది లక్షల రూపాయలు తీసుకుంటాం.. నచ్చినోళ్లకే ఓటేస్తామని హుజూరాబాద్​ ప్రజలు చెబుతున్నారని సీతక్క తెలిపారు. హుజూరాబాద్​ మాదిరిగానే బీసీ, ఎస్టీ, ఆదివాసీ, గిరిజనులు, మహిళలకు రాష్ట్ర సంపద పంచాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రమంతా అర్హులైన దళితులకు న్యాయం చేయాలనే రేవంత్​రెడ్డి దీక్ష చేస్తున్నారని సీతక్క పేర్కొన్నారు. ఆదివాసీ హక్కుల కోసం, పోడు భూముల్లో మొక్కలు పెంచుతున్న ప్రభుత్వ విధానాలపై ఎండగట్టేందుకే రేవంత్​రెడ్డి దీక్ష చేస్తున్నారని స్పష్టం చేశారు.

తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యమని చెప్పిన కేసీఆర్​ మాట తప్పారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాగ్​లాగ్​ పోస్టులు 30 వేలకు పైగా ఖాళీగా ఉన్న.. మూడు పోస్టులనూ భర్తీ చేయలేదని ఆరోపించారు. తక్షణమే ఆయా ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్​తోనే రేవంత్​రెడ్డి దీక్ష చేస్తున్నారని సీతక్క తెలిపారు.

ఇంద్రవల్లిలో దళిత ఆదివాసీ దండోర పేరిట కాంగ్రెస్​ కార్యక్రమం నిర్వహించిన తర్వాతనే.. సీఎంవోలో దళిత అధికారిని నియమించినట్లు సీతక్క తెలిపారు. రేవంత్​రెడ్డి వెలుగులోకి తీసుకురావడంతోనే నిఘా విభాగం డీజీని మార్చారని సీతక్క పేర్కొన్నారు. మనకు కావాల్సింది ప్రభుత్వం మెడలు వంచి సాధించికుందామన్న సీతక్క.. తెలంగాణలో రానున్న రోజుల్లో కాంగ్రెస్​ జెండా ఎగరబోతోందని స్పష్టం చేశారు.

SEETHAKKA: దళిత బంధు మాదిరిగానే.. రాష్ట్ర సంపద ప్రజలకు పంచండి: సీతక్క

ఇదీచూడండి: Revanth Reddy: మూడుచింతలపల్లిలో రేవంత్ రచ్చబండ... దళితులతో ముచ్చట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.