ETV Bharat / state

కుమార్తెల ముందే భార్యపై శానిటైజర్​ పోసి నిప్పంటించిన భర్త.. సీసీ కెమెరాలో దృశ్యాలు

author img

By

Published : Mar 7, 2023, 10:11 PM IST

Updated : Mar 7, 2023, 10:51 PM IST

husband killed his wife by pouring sanitizer: మేడ్చల్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కష్ట, సుఖాల్లో తోడుగా ఉండాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కట్టుకున్న భార్యపై శానిటైజర్​ పోసి తన కూతుళ్ల ఎదుటే ఆమెకు నిప్పంటించాడు. దీంతో ఆమె ఇరవై రోజులుగా మృత్యువుతో పోరాడి ఇవాళ మృతి చెందింది. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో అవి మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.

husband killed his wife
husband killed his wife

కుమార్తైల ముందే భార్యపై శానిటైజర్​ పోసి నిప్పంటించిన భర్త.. సీసీ కెమెరాలో దృశ్యాలు

husband killed his wife by pouring sanitizer: కష్టాల్లో తోడుగా, తన సంతోషాన్ని పంచుకుంటూ జీవితాంతం అండగా ఉండాల్సిన తన భర్తే తన పాలిట యముడయ్యాడు. పెళ్లి నాటి ప్రమాణాల్లో ఏడు అడుగులు వేసి కలకాలం తోడుగా ఉంటానని మాట ఇచ్చిన ఆయన.. కుటుంబ కలహాలతో కన్న కూతుళ్ల ఎదుటే కట్టుకున్న భార్యకు నిప్పంటించాడు. కుమార్తెలు ఎంత వద్దన్నా వినకుండా కర్కశంగా ప్రవర్తించాడు. తమ తల్లి మృతికి తండ్రే కారణమంటూ కూతుళ్లు ఫిర్యాదు చేసిన మేడ్చల్​ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది: మేడ్చల్​ పోలీసు స్టేషన్​ పరిధిలోని తిరునగరి నరేంద్ర, అతని భార్య నవ్య శ్రీ వాళ్ల ఇద్దరు కూతుళ్లు మేఘన, చందనలతో కలిసి జీవిస్తున్నారు. ఎంతో సంతోషంగా జీవితం గడుపుతున్న వారి కుటుంబంలో గత నెల 18న చిన్న గొడవ జరిగింది. అది కాస్త చినికి చినికి గాలివానలా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నరేంద్ర.. తన భార్య నవ్య శ్రీ ఒంటిపై శానిటైజర్​ పోశాడు. అనంతరం అగ్గి పుల్లతో నిప్పంటించాడు. ఇంతలో చుట్టుపక్కల వారు గమనించి ఆమె ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

అనంతరం ఆమె కుమార్తెలు చుట్టుపక్కల వారి సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు మెరుగైన వైద్యం అందించారు. గత ఇరవై రోజులుగా ఆమెకు చికిత్స అందించిన డాక్టర్లు ఇవాళ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో నవ్య శ్రీ కుమార్తెలు చందన, మేఘనలు తమ తల్లి మరణానికి తండ్రే కారణమని స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కూతుళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కలచి వేస్తున్న సీసీ కెమెరా దృశ్యాలు: దాడికి సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా.. నరేంద్రే తన భార్యపై శానిటైజర్​ పోసి నిప్పంటించిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా పిల్లలు ఎంత వద్దని బతిమాలిన ఏ మాత్రం చలించని ఆయన ఎంతో మూర్ఖంగా ప్రవర్తించినట్లు దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలు మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.

"గత నెల శివరాత్రి రోజు ఇంట్లో చిన్న గొడవ జరిగింది. దాంతో మా భార్త నాపై శానిటైజర్​ పోసి నిప్పంటించాడు. నాకు సంతోషాన్ని పంచింది ఆయనే.. కష్ట పెట్టింది తనే.. ఇలా బాధను మిగిల్చింది ఆయనే".. - చనిపోవడానికి ముందు నవ్య శ్రీ

ఇవీ చదవండి:

Last Updated : Mar 7, 2023, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.