ETV Bharat / state

అయ్యప్ప మాల ధరించాడని ఎండలో నిల్చోబెట్టారు

author img

By

Published : Dec 10, 2019, 3:32 PM IST

అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని స్కూల్​ యూనిఫాం వేసుకొని రావాలంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు విద్యార్థిని అరగంటపాటు ఎండలో నిల్చోబెట్టాడు.

AYYAPPA
అయ్యప్ప మాల ధరించాడని ఎండలో నిల్చోబెట్టారు

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలోని డాన్‌బాస్కో ఉన్నత పాఠశాలలో చదవుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప మాల ధరించాడు. మాలకు సంబంధించిన బట్టలు వేసుకొని పాఠశాలకు వెళ్లగా... అవి తీసివేసి పాఠశాల యూనిఫాం వేసుకుని రావాలని ప్రిన్సిపల్‌ విద్యార్థిని అరగంటపాటు ఎండలో నిల్చోబెట్టారు.

తరువాత విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అయ్యప దీక్షదారులు కలసి పాఠశాల ఎదుట బైఠాయించారు. యాజమాన్యం తీరు ఏం బాగాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొరపాటు జరిగిందని, ఇకముందు ఇలాంటివి జరగకుండా చేసుకుంటామని స్కూల్ యాజమాన్యం వివరణ ఇవ్వడంతో బాలుడి కుటుంబ సభ్యులు, అయ్యప్ప దీక్షదారులు ఆందోళనను విరమించారు.

అయ్యప్ప మాల ధరించాడని ఎండలో నిల్చోబెట్టారు

ఇవీ చూడండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !

Intro:Body:Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.