ETV Bharat / state

Mahbubnagar Maternal Child Health and Nutrition Department : మాతాశిశు ఆరోగ్యం, పోషణ విభాగంలో వెనకబడుతోన్న మహబూబ్‌నగర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 10, 2023, 10:39 PM IST

Mahbubnagar Maternal Child Health and Nutrition Department : కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పోల్చితే.. మహబూబ్​నగర్ జిల్లా మాతాశిశు ఆరోగ్యం, పోషణ విభాగంలో వెనకబడుతోంది. ఆగస్టులో ప్రభుత్వం విడుదల చేసిన ఎంహెచ్​ఎన్​ సూచికల్లో.. కొత్త జిల్లాలు మెరుగైన పనితీరు సాధిస్తే.. మహబూబ్​నగర్ జిల్లా 16వ స్థానానికి పరిమితమైంది. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మఒడి లాంటి పథకాలున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రైవేటు వైపే మొగ్గు చూపుతున్నారు. మహబూబ్​నగర్ జిల్లాలో ప్రైవేటులో జరిగే ప్రసవాల్లో 63 శాతానికి పైగా సి-సెక్షన్లే జరగడం గమనార్హం. మాతాశిశు ఆరోగ్యం-పోషణ విషయంలో మహబూబ్​నగర్ జిల్లా పనితీరుపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

MHN Indicators
Mahabubnagar

Mahbubnagar Maternal Child Health and Nutrition Department మాతాశిశు ఆరోగ్యం పోషణ విభాగంలో వెనకబడుతోన్న మహబూబ్‌నగర్‌

Mahbubnagar Maternal Child Health and Nutrition Department : ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఒకప్పటి కేంద్రం మహబూబ్​నగర్. అప్పట్లో ఎలాంటి వైద్యసేవలు పొందాలన్నా.. అంతా మహబూబ్​నగర్​కే వచ్చేవాళ్లు. ఇప్పటికీ మెరుగైన వైద్యం, ప్రసవాల కోసం మిగిలిన ఐదు జిల్లాల ప్రజలు మహబూబ్​నగర్ ఆసుపత్రి(Mahabubnagar Hospital)కే వస్తుంటారు. మెరుగైన వైద్య సేవలకు కేంద్రమైన మహబూబ్​నగర్ జిల్లా.. మాతాశిశు ఆరోగ్యం(Maternal Child Health) విషయంలో మాత్రం కొత్తగా ఏర్పడిన జిల్లాల కంటే వెనకబడుతోంది.

తాజాగా ఆగస్టులో విడుదల చేసిన ఎంహెచ్​ఎన్ సూచికల్లో మహబూబ్​నగర్ జిల్లా 16వ స్థానానికే పరిమితమైంది. నూతనంగా ఏర్పడిన జోగులాంబ గద్వాల జిల్లా రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా.. నాగర్ కర్నూల్ జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. మహబూబ్​నగర్ జిల్లాలో 73 శాతం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే.. అందులో 42 శాతం శస్త్రచికిత్సల ద్వారానే ప్రసవాలు జరిగాయి. దీన్ని 35 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

PHCs in Telangana 2023 : తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విస్తరణ... ఇంటి దగ్గరలోనే వైద్యం

Mahabubnagar District Ranks 16th in MHN Indicators : పట్టణంలోని కుమ్మరివాడి పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఎక్కువగా ప్రసవాలు జరుగుతున్నాయి. ఆగస్టులో ఈ కేంద్రం పరిధిలో 29 ప్రసవాలు జరిగితే అందులో 18 ప్రైవేటులో జరిగాయి. జిల్లా స్థాయిలో జడ్చర్ల, రాజాపూర్, మోతీనగర్, పాత పాలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(Palamuru Primary Health Centres) తక్కువ స్కోరుతో వెనకబడి ఉన్నాయి. అమిస్తాపూర్, బూర్గుపల్లి, శేరివెంకటాపూర్, బాదేపల్లి, నెల్లికొండి ఆరోగ్య ఉపకేంద్రాలు మంచి పనితీరు ప్రదర్శించడంలో వెనకబడ్డాయి. దీంతో మహబూబ్​నగర్ జిల్లా రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్కోరు సాధించడంలో వెనకబడుతోంది. ఎప్పటికప్పుడు అవగాహన కల్పించినా.. వివిధ రకాల కారణాలతో ప్రైవేటుకు వెళ్తున్నారని వైద్యులు, సిబ్బంది చెబుతున్నారు.

Dr Raja Rao Interview : 'గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే.. ఎంసీహెచ్‌ కేంద్రాలు'

'గర్భిణీలు 18 మంది ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి డెలివరీ చేయించుకున్నారు. దీని గురించి రివ్యూ మీటింగ్ పెట్టి మమ్మల్ని అడిగారు. ఎందుకు 18 మంది ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు..? గవర్నమెంట్ హాస్పిటల్​కి ఎందువల్ల రాలేదని అడగడం జరిగింది. ముఖ్యంగా యూపీహెచ్​సీ కుమ్మరవాడిలో డైలీ ఓపీ 150 నుంచి 180 దాకా వస్తుంది. ప్రెగ్నెంట్​ మహిళల కోసం ప్రతి మంగళ, గురువారాలు ప్రత్యేకంగా వారికి ఓపీ చూస్తున్నాం. 9 నెలల తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి ఏమైనా నొప్పులు వస్తే.. మా దగ్గరలో ప్రైవేటు ఆసుపత్రి ఉందని వెళుతున్నారు.' -డాక్టర్ ఖాజా, కుమ్మరివాడి యూపీహెచ్​సీ మెడికల్ ఆఫీసర్

ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం : ఒకప్పటితో పోల్చితే మహబూబ్​నగర్ జిల్లాలో ప్రభుత్వ ప్రసవాలు, సాధారణ ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచామని.. ప్రైవేటులో సి-సెక్షన్లు తగ్గించామని.. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణ చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తామన్నారు. నొప్పి, బాధను తట్టుకోలేక కొందరు.. మంచి ముహుర్తాలున్నాయని మరికొందరు ఇతర కారణాలతో ప్రైవేటును ఆశ్రయిస్తున్నారన్నారు.

మొత్తంగా అన్ని జిల్లాలతో చూస్తే మహబూబ్​నగర్ వెనకబడినా.. 90 పాయింట్లకు పైగా స్కోరుతో పోమాల్, వేముల, గాదిర్యాల్, శాఖాపూర్, ముకర్లబాద్ సబ్ సెంటర్లు ఉత్తమ పనితీరు ప్రదర్శించాయి. ఈ కేంద్రాలను స్ఫూర్తిగా తీసుకుని అన్నిచోట్ల పనిచేస్తే మరింత మెరుగైన ర్యాంకు సాధించవచ్చని వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు.

AIG Hospitals World IBD Day : 'ఆహార అలవాట్లలో మార్పులతోనే గ్యాస్ట్రిక్ సమస్యలు'

Male and Female Genitalia in One Person : ఒకే వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు.. విజయవంతంగా తొలగించిన కిమ్స్‌ వైద్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.