ETV Bharat / state

PUVVADA AJAY: ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిచి చూపిస్తాం: మంత్రి పువ్వాడ

author img

By

Published : Apr 16, 2023, 3:28 PM IST

Updated : Apr 16, 2023, 5:14 PM IST

BRS Atmiya Sammelan In Khammam: సీఎం కేసీఆర్​పై విమర్శలు చేసిన వారు శంకరగిరి మాన్యాలలో కలిసి పోయారని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. ఈ ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీకి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలోని ఖానాపురం హవేలి డివిజన్​లో జరిగిన బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

puvvada ajay
puvvada ajay

BRS Atmiya Sammelan In Khammam: ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ కచ్చితంగా 10కి 10 స్థానాలు గెలిచి చూపిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ ధీమా వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఖమ్మంలో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి.. బీఆర్​ఎస్​ పార్టీని బలోపేతం చేస్తూ.. తమపై ఆరోపణలు చేస్తున్న వారికి గట్టి హెచ్చరిక ఇస్తామని పేర్కొన్నారు. ఖమ్మంలోని ఖానాపురం హవేలి డివిజన్​లో జరిగిన బీఆర్​ఎస్​ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతిపక్షాలు, పార్టీని బయటకు వెళ్లిన వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాగే నగరంలో జరిగిన ముస్లిం సోదరులకు రంజాన్​ తోఫా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్​తో పెట్టుకున్న వాళ్లు శంకరగిరి మాన్యాలు పట్టారని మంత్రి పువ్వాడ ధ్వజమెత్తారు. డబ్బు, స్వార్థ రాజకీయాలు ఖమ్మం జిల్లాలో నడవవని.. ఈ సందర్భంగా ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. కాంట్రాక్టుల కోసం పార్టీని వాడుకున్న వారు.. ఇవాళ పార్టీ నుంచి బయటకు వెళ్లి విమర్శలు చేస్తున్నారన్నారు. వీటన్నింటిపై ప్రజలే రానున్న ఎన్నికల్లో తగు బుద్ధి చెప్పుతారని.. ఆ రోజు ఎంత దూరంలోనూ లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని.. తగిన సమయంలో భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.

చీమలపాడు ఘటనలో మృతి చెందిన వారికి నివాళి: బీఆర్​ఎస్​ పార్టీ అధినేత కేసీఆర్​, పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సూచన మేరకు ఖానాపురం హవేలీ డివిజన్​లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. చీమలపాడు ఘటనలో మృతి చెందిన పార్టీ కార్యకర్తలు ఆత్మకు శాంతి కలగాలని కాసేపు మౌనం వహించారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు సంపక్తి భోజనాలు వడ్డించడం జరిగింది.

ముస్లిం సోదరులకు రంజాన్​ తోఫా అందించిన పువ్వాడ: రంజాన్​ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్​ తోఫాను ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అందించారు. అన్ని కుల, మత సామరస్యాలకు బీఆర్​ఎస్​ ప్రభుత్వం నిదర్శనమని పేర్కొన్నారు. నగరంలోని 37,38,39,40 డివిజన్​లోని పేద ముస్లింలకు తోఫా(దుస్తులు)లను ప్రభుత్వం ఉచితంగా అందించింది. పువ్వాడ పౌండేషన్​ తరఫున సేమ్యా కిట్​ను అందించారు. ముస్లిం సోదరులు అందరికీ రంజాన్​ శుభాకాంక్షలు తెలిపారు.

రంజాన్​ తోఫాను అందిస్తున్న మంత్రి పువ్వాడ
రంజాన్​ తోఫాను అందిస్తున్న మంత్రి పువ్వాడ

"కేసీఆర్‌తో పెట్టుకున్న వాళ్లు శంకరగిరి మాన్యాలు పట్టారు. డబ్బు, స్వార్థ రాజకీయాలు ఖమ్మం జిల్లాలో నడవవు. కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారు. కాంట్రాక్టుల కోసం పార్టీని వాడుకున్నవారు ఇవాళ విమర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిచి చూపిస్తాం. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం." - పువ్వాడ అజయ్​ కుమార్​, రవాణా శాఖ మంత్రి

ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిచి చూపిస్తాం: మంత్రి పువ్వాడ

ఇవీ చదవండి:

Last Updated : Apr 16, 2023, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.