ETV Bharat / state

విషాదంలోనూ.. విజేతగా నిలిచిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుమార్తె

author img

By

Published : Nov 26, 2022, 2:03 PM IST

FRO Srinivas Rao daugter gold medal: గొత్తికోయల చేతిలో అటవీ అధికారి హత్యకు గురైన ఉదంతం అందరినీ కదిలించింది. ఆ ఘటనతో ఆయన కటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి అమరుడైన నాలుగో రోజునే ఆయన కుమార్తె క్రీడా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది.

విజేతగా నిలిచిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుమార్తె
విజేతగా నిలిచిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుమార్తె

రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించి.. తండ్రికి తగిన తనయురాలని నిరూపించుకుంది ఎఫ్ఆర్వో ​శ్రీనివాస్​రావు కుమార్తె కృతిక. ప్రస్తుతం ఆరో తరగతి చదువుకుంటోంది. ఆ చిన్నారి మనోధైర్యం ముందు ఓటమి తల వంచింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి చెందిన ఎఫ్ఆర్​వో సీహెచ్​ శ్రీనివాసరావు ఈ నెల 22న గొత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.

తండ్రి ప్రోత్సాహంతో అథ్లెటిక్స్​లో రాణిస్తున్న కుమార్తె కృతిక.. ఇలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం చాటుకుంది. కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన ఉమ్మడి ఖమ్మం సబ్​ జూనియర్స్​ అథ్లెటిక్స్​లో బంధువుల సాయంతో హాజరైంది. అండర్ 10 విభాగంలో లాంగ్​జంప్​లో స్వర్ణం, 100 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది. డిసెంబరు 5, 6 తేదీల్లో హైదరాబాద్​లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. నిర్వాహకులు, కోచ్​లు చిన్నారి మనోధైర్యాన్ని మెచ్చుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.